రామ్‌చరణ్‌ను ఘోరంగా అవమానించిన సమంత?
తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో క్యూట్ బ్యూటీ సమంతకు మయోసైటిస్ వ్యాధి సోకింది. దీంతో చికిత్స తీసుకునేందుకు ఏడాదిపాటు సినిమాలకు విరామం ప్రకటించింది. అప్పటివరకు తాను ఒప్పుకున్న సినిమాల్లో నటించేందుకు నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్ ను కూడా వెనక్కి తిరిగిచ్చేసింది. చికిత్స తీసుకుంటూనే దేశ, విదేశాల్లో పర్యటించింది. ఎక్కడున్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ తన వ్యక్తిగత విషయాలను కూడా సామాజిక మాధ్యమాలద్వారా అభిమానులతో పంచుకుంటూ వచ్చింది.
సామ్ పై చెర్రీ అభిమానుల ఫైర్
అయితే తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆఫర్లు రాలేదు. అయితే వచ్చినవాటిని కూడా తాను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించబోతున్న చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. అయితే ఈ ఆఫర్ ను సమంత తిరస్కరించింది. తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ సినిమా చేయబోతున్నారు. దీనికి ముందుగా గేమచేంజర్ తోపాటు బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ హీరో పక్కన ఆఫర్ వచ్చినప్పటికీ సమంత సినిమా చేయననడంపై మెగా అభిమానులు సామ్ పై మండిపడుతున్నారు.

హీరోలు అవకాశాలివ్వలేదా?
సంవత్సరం సమయం విరామం తీసుకుంటే కొంతమంది స్టార్ హీరోలు తనకు అవకాశాలివ్వలేదని, అందరూ తనవాళ్లే అనుకున్నప్పటికీ సరైన సమయంలో తనకు ఆఫర్లు ఇవ్వకుండా అవమానించారనే భావనలో ఉన్న సమంత తెలుగులో స్టార్ హీరోల సరసన నటించకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే రామ్ చరణ్ సరసన అవకాశం వచ్చినప్పటికీ తిరస్కరించిందని భావిస్తున్నాయి. అయితే ఇది రామ్ చరణ్ ను ఘోరంగా అవమానించడమే అవుతుందంటూ చెర్రీ అభిమానులు సమంతకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications