అర్దరాత్రి సమంతకు జిమ్ ట్రైనర్ మేసేజ్..వస్తావా అంటూ పోస్ట్..షేర్ చేసిన హీరోయిన్
హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాలను కూడా ఆపేసినట్టు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం విశేషం. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా జిమ్ ట్రైనర్ తనకు పెట్టిన మేసేజ్‌లను సోషల్ మీడియాలో సమంత షేర్ చేసింది. అసలు ఏం జరిగిందంటే... రేపు ఉదయం జిమ్‌కు వస్తావా అని జిమ్ ట్రైనర్ సమంతకు మేసేజ్ చేశాడట.

బాడీ పెయిన్స్‌గా ఉన్నాయని.. సెలవు తీసుకుంటానని .. రేపు జిమ్‌కు రాలేనని చెప్పినప్పటికీ ..బలవతంతంగా తీసుకువెళ్లి మరి ట్రైనర్ సమంతతో కసరత్తులు చేయించాడట. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా వెల్లడించింది. జిమ్ ట్రైనర్ పెట్టిన మేసేజ్‌లను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications