ఆ హీరో నా పార్ట్స్ నొక్కేశాడు..ప్రభాస్ హీరోయిన్ సంచలనం

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది.ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి వెల్లడించింది.

హీరోయిన్ సంజనా గల్రానీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. 'సోగ్గాడు','బుజ్జిగాడు', గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో సంజనా గల్రానీ నటించింది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ ఈ భామ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ భామ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి విషయాన్ని బయటపెట్టింది. ఓ కన్నడ హీరో పాట షూటింగ్ సమయంలో తనతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.

Heroine Sanjjanaa Galrani accused the Kannada hero

సీన్‌కు ఓకే చెప్పగానే ఆ హీరో వచ్చి నా భుజాలను పట్టుకోని గట్టిగా నలిపేశాడు. ఆ నొప్పిని భరించలేకపోయాను. ఏంటి అంత గట్టిగా నొక్కేరని అడిగితే.. మేనేజ్ చేసుకో అంటూ పొగరుగా సమాధానం ఇచ్చాడు. నాకు కోపం వచ్చింది. వెంటనే నేను ఓ అరగంట నీతో షూట్ చేయనన్నాను. నేను నీతో దెబ్బలు తినడానికి హీరోయిన్‌గా రాలేదు. నేనేమీ రౌడీని కాదు.. నీతో యాక్షన్ సీన్స్ చేయడానికి అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయానని సంజనా గల్రానీ చెప్పుకొచ్చింది. అయితే సదరు హీరో పేరు చెప్పడానికి మాత్రం సంజనా గల్రానీ ఇష్టపడలేదు. ప్రస్తుతం సంజనా గల్రానీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+