ప్రియుడితో పెళ్లికి రెడీ అయిన రామ్ చరణ్ లవర్
వెండితెర మెరుపుతీగ.. షాజన్ పదంసీ పెళ్లి పీటలెక్కనుంది. 'రాకెట్ సింగ్'తో బాలీవుడ్‌లో మెరిసిన ఈ యంగ్ బ్యూటీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన 'ఆరెంజ్'లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ సినిమాలో రామ్ చరణ్ గర్ల్‌ఫ్రెండ్‌గా తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. ముఖ్యంగా 'రూబా రూబా' పాటలో ఆమె హావభావాలు యువతను మెస్మరైజ్ చేశాయి. ఆ తర్వాత వెంకటేష్‌తో కలిసి 'మసాలా'లో సందడి చేసిన షాజన్, తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో తనదైన ముద్ర వేసింది.
అయితే, 2023 నుంచి వెండితెరకు దూరంగా ఉన్న ఈ అందాల భామ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి తెరలేపింది. గత కొంతకాలంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆశిష్‌తో ప్రేమలో ఉన్న షాజన్, గతేడాది నవంబర్‌లోనే నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు.

తాజా సమాచారం ప్రకారం, షాజన్, ఆశిష్‌ల వివాహం జూన్ 5న జరగనుంది. ఆ తర్వాత జూన్ 7న సంగీత్ వేడుకతో పాటు మరికొన్ని వేడుకలు కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు.
తమ అభిమాన నటి పెళ్లి చేసుకోబోతోందన్న వార్త తెలుసుకున్న నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా షాజన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు వెండితెరపై తన అందంతో మెరిపించిన షాజన్, ఇకపై తన జీవిత భాగస్వామితో కలిసి కొత్త జీవితాన్ని ఆనందంగా గడపడానికి రెడీ అవుతుంది.












Click it and Unblock the Notifications