దర్శకులు హీరోయిన్లలో వాటినే చూస్తారు..మ్యాటర్ మొత్తం బయటపెట్టిన బ్యూటీ
గతంలో హీరోయిన్ అంటే కథలో ప్రాధాన్యత ఉండేది. హీరోలతో పాటు, సమానంగా హీరోయిన్లకు సైతం ప్రత్యేక పాత్రలు డిజైన్ చేసేశారు. అలా చేశారు కాబట్టే సావిత్రి, సౌందర్యల గురించి నేటితరం ప్రేక్షకులు కూడా చర్చించుకుంటున్నారు. అయితే క్రమేపి తెలుగు సినిమాల్లో హీరోయిన్ల పాత్ర తగ్గిపోతూ వస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ పూర్తిగా కనిపిస్తోంది. కథలు కూడా హీరోల చూట్టునే తిరుగుతున్నాయి.
నేటితరం హీరోయిన్లు కేవలం పాటలకు, హీరోలతో రొమాన్స్ చేయడానికి మాత్రమే పనికొస్తున్నారన్నరట్టుగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు నాలుగు నెలల తర్వాత కనిపించడం లేదు. ఇక తెలుగు అమ్మాయిల గురించి అయితే ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. నాలుగు నెలలకు ఓ హీరోయిన్ టాప్ ప్లేస్‌లో దర్శనం ఇస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో దర్శకుల మైండ్ సెట్ కూడా మారాల్సి ఉంది.

తాజాగా ఓ హీరోయిన్ దర్శకులు గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొదట ఎలాంటి మూవీ చేస్తే తర్వాత దర్శకులు, హీరోలు ఆ విధంగానే చూస్తారని యంగ్ హీరోయిన్ శిల్ప మంజునాథ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు గ్లామర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని, హీరోయిన్లలో స్క్రీన్ షోనే చూస్తున్నారని అభిప్రాయపడింది. దర్శకులు సైతం అందంగా ఉన్న అమ్మాయిలకే అవకాశాలు ఇస్తున్నారని ఈ భామ చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications