అల్లు అర్జున్ హైట్ గురించి దారుణంగా మాట్లాడిన హీరోయిన్..నా పక్కన చేయాలంటే స్టాండ్ వేసుకోవాలంటూ

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశేయోక్తి కాదు. తెలుగు, కన్నడలో అల్లు అర్జున్‌కు మంచి క్రేజ్ ఉంది. కాని పుష్ప సినిమాతో ఇండియా మొత్తం తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకుని సత్తా చాటాడు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు.

 Heroine shocking comments on allu arjun height

అయితే నేషనల్ అవార్డు తీసుకున్న సమయంలో అల్లు అర్జున్ ధరించిన షూస్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడించింది. హైట్‌గా కనిపించడం కోసం అల్లు అర్జున్ హిల్స్ ఉన్న షూస్ వేసుకున్నారనే కామెంట్స్ వినిపించాయి. అయితే అల్లు అర్జున్ ఎత్తు గురించి ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్ నా పక్కన చేయాలంటే స్టాండ్ వేసుకోవాలంటూ ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 Heroine shocking comments on allu arjun height

ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ కంటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ. గతంలో ఆమె ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె ఈ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే... అశ్విని శ్రీ. హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ సక్సెస్ మాత్రం దక్కలేదు. అమీర్‌పేట లో, నువ్వు నేను ఓరేయ్ ఓసేయ్, బీటెక్ బబ్లూ వంటి సినిమాల్లో అశ్విని శ్రీ హీరోయిన్‌గా నటించింది.

 Heroine shocking comments on allu arjun height

ఈ సినిమాలన్నీ కూడా ఫెయిల్ కావడంతో ..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి కొన్ని సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్',రవితేజ నటించిన 'రాజా ది గ్రేట్' వంటి హిట్ సినిమాల్లో అశ్విని శ్రీ నటించింది. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో అశ్విని శ్రీ మాట్లాడుతూ..తెలుగు టాప్ హీరోలతో ఐటం సాంగ్స్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది.

 Heroine shocking comments on allu arjun height

అయితే అల్లు అర్జున్ నా పక్కన చేయాలంటే స్టాండ్ వేసుకోవాల్సి వస్తుందని ..ప్రభాస్ అయితే నా ఎత్తుకు సరిపోతారని ఈ బిగ్‌బాస్ బ్యూటీ చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ హైట్ గురించి అశ్విని శ్రీ చేసిన కామెంట్స్‌పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న వ్యక్తిపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని అశ్విని శ్రీని అల్లు అర్జున్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే దీనిపై ఆమె క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న అశ్విని శ్రీ.. బయటకు వచ్చాక ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+