శ్రీలీల పెట్టే కండిషన్ ఏంటో తెలుసా?
సినీ పరిశ్రమలో ఎప్పుడు, ఎవరు, ఎలా విజయం సాధిస్తారో చెప్పలేం. అదంతా అదృష్టంపై ఆధారపడివుంటుంది. కొందరు సాదా సీదాగా పరిశ్రమలోకి వచ్చి పెద్ద స్టార్ అయిపోతారు. తెలుగు సినీ పరిశ్రమలోని హీరోయిన్లలో ప్రస్తుతం శ్రీలీల ట్రెండ్ నడుస్తోంది. ప్రతి హీరో తమ పక్కన నటించడానికి శ్రీలీలే కావాలంటూ డైరెక్టర్లకు సిఫార్సు చేస్తున్నారు. ఆమె మాత్రం ఎన్ని సినిమాలని చేస్తుంది? ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలే 10 నుంచి 12 వరకు ఉన్నాయి.
ఎంతోమంది హీరోయిన్లు శ్రీలీల ధాటికి కనుమరుగైపోతున్నారు. టాలీవుడ్ లో ఎక్కడ విన్నా ఆమె పేరే వినపడుతోంది. పెళ్లిసందD సినిమాద్వారా టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చిన ఈ అమ్మడు ఆరోజు నుంచి ఈరోజు వరకు వెనుతిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ బిజీగా ఉంటోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, నటసింహం నందమూరి బాలకృష్ణ, హీరో రామ్ పోతినేని లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. ధమాకా చిత్రంతో శ్రీలీల ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం.. ఇలా ప్రతి విషయంలో అదరగొట్టేసింది. ఈ యంగెస్ట్ బ్యూటీ తన వద్దకు వచ్చే ప్రతి డైరెక్టర్ కు ఒక కండిషన్ మాత్రం కచ్చితంగా పెడుతుంది. ఆ కండిషన్ ని ఒప్పుకునే విధంగా డైరెక్టర్స్ ఉంటే వెంటనే ఆ సినిమాకు సైన్ చేయడానికి ఒప్పుకుంటుంది.
కాల్ షీట్స్ ను అడ్జస్ట్ చేసి సమాయానికి ఇస్తానని, అయితే ఇంకా అదనంగా అడిగితే మాత్రం ఇవ్వలేనని, మీరు అదనంగా డబ్బులిచ్చినా తాను మాత్రం అదనపు కాల్షీట్లు ఇవ్వలేనని చెప్పేస్తుంది. ఇచ్చిన కాల్షీట్ల ప్రకారం సినిమా చేస్తానంటేనే ఇస్తాను అని చెబుతుంది. తాను కమిట్ అయిన సినిమాలపట్ల శ్రీలీల అంత నిబద్ధతగా ఉంటుంది. అందుకే తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుందని నెటిజన్లు కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications