ఇంటికొచ్చిన డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల తల్లి?

సినీ పరిశ్రమ అన్న తర్వాత హీరోలకన్నా హీరోయిన్ల జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. అందరూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీలీల రవితేజ సరసన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా చేసింది. ఈ చిత్రం సంచలన విజయం సాధించడంతో శ్రీలీలకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అందం, నటనకు తోడు డ్యాన్స్ లు కూడా బాగా చేస్తుండటంతో నిర్మాత దర్శకులతోపాటు హీరోలు కూడా శ్రీలీలే కావాలంటూ పట్టుబట్టడం ప్రారంభించారు.

వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈ బ్యూటీకి ఇటీవల కాలం కలిసిరాలేదు. నాలుగు సినిమాలు వరుసగా ఫ్లాపవడంతో సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకుంది. మెడిసన్ చేస్తున్న ఈ అమ్మడు కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించి మెడికల్ పరీక్షలకు హాజరుకాబోతోంది. కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతోపాటు గతంలోలా వచ్చిన ఆఫర్లను కూడా ఒప్పుకోవడంలేదు.

heroine Srililas mother gave a warning to the film director who came home?

శ్రీలీలకు కథ వినిపించేందుకు ఇటీవలే ఓ దర్శకుడు ఆమె ఇంటికి వెళ్లారు. కథ వివరించి చెప్పడంతోపాటు చిత్రంలో బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని, వీటిలో నటించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కథ శ్రీలీల తల్లికి నచ్చలేదు. అంతేకాకుండా బోల్డ్ సన్నివేశాల్లో నటించాలని చెప్పడంతో అతనికి వార్నింగ్ ఇచ్చి పంపించివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న గుంటూరు కారం సినిమా కూడా ఫ్లాపవడంతో ఎటువంటి సినిమాలు చేయాలో ఈ అమ్మడుకు అర్థం కాకుండా ఉంది. యువ హీరోతో చేసిన ఆదికేశవ లాంటి సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోవడంతో పరిశ్రమలో కాస్తంత బ్యాడ్ టైమ్ నడుస్తోందని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+