శ్రీలీల తొలి ముద్దు అతనికి ఇచ్చేసిందా..?
తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్ చల్ చేసింది. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి.
అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందనే వార్తలొచ్చాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే.

ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప2 సినిమాలో ఐటం సాంగ్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఐటం సాంగ్‌కు సంబంధించిన ఫొటో సైతం లీక్ అయింది. అయితే గతంలో శ్రీలీల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ. వరితోనైనా ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు శ్రీలీల అవుననే సమాధానం ఇచ్చింది. ఆ మధ్య భగవంత్ కేసరి సక్సెస్ అయిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్య్వూలో.. శ్రీ లీల ఒకవేళ లిప్ లాక్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నిస్తే... ఊహించని ప్రశ్నకు కంగుతిన్న శ్రీ లీల.. కాసేపు ఆలోచించి.. తాను ఎవ్వరికీ లిప్ లాక్ ఇవ్వను అంటూ సమాధానం చెప్పేసింది.
ఒకవేళ అలాంటి సీన్ చేయాల్సి వస్తే మాత్రం డైరెక్ట్‌గా నాకు కాబోయే భర్తతోనే చేస్తాను అంటూ కుండ బద్దలు కొట్టేసింది. అయితే శ్రీలీల ఆల్‌రెడీ లిప్ లాక్ ఇచ్చిందనే చర్చ సాగుతోంది. శ్రీలీల 2019లోనే 'కిస్' అనే ఒక కన్నడ సినిమా చేసింది, దాన్ని ఐ లవ్ యూ ఇడియట్ అనే పేరుతో తెలుగులో ఆహా రిలీజ్ చేసింది. అయితే ఆ సినిమాలోనే ఆమె హీరో విరాట్‌కి శ్రీలీల లిప్ లాక్ ఇచ్చేసింది. కానీ ఇప్పుడు అసలు ఎవరికీ ఇవ్వను అన్నట్టు చెబుతుంది. ప్రస్తుతం శ్రీలీల లిప్ లాక్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications