విడాకులకు రెడీ అయిన స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో జీవితాన్ని కొనసాగించలేక తమ బంధానికి బ్రేకప్ చెప్పేస్తున్నారు. తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం అత్తింటి గొడవలు , పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైయిన్ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకులు బాట పడుతున్నారు.
చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, నాగార్జున కొడుకు నాగచైతన్య, మోహన్ బాబు కొడుకు మనోజ్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య , పవన్ కళ్యాణ్ వంటి వారు విడాకులు తీసుకున్న వారి జాబితాలో ఉన్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సైతం విడాకులు తీసుకోవడానికి రెడీ అయిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ విడాకులు తీసుకోబోందనే వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన విద్యా బాలన్ ఆ తరువాత హీరోయిన్‌గా మారింది. ముఖ్యంగా డర్టీ పిక్చర్ సినిమా విద్యా బాలన్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇక ప్రముఖ సినీ నిర్మాత సిద్దార్ధ్ రాయ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది విద్యా బాలన్.
అయితే విద్యా బాలన్ తన భర్త సిద్దార్ధ్ రాయ్‌కు విడాకులివ్వాడానికి రెడీ అవుతుందని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు సంచలన పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీంతో అది చూసిన వారంతా నిజంగానే విడాకులు తీసుకుంటుందా? అని షాక్ అవుతున్నారు.మరీ తన విడాకులపై వస్తోన్న రూమర్లపై విద్యా బాలన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications