బిగ్‌బాస్‌లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఇక రచ్చ రచ్చే..!
తెలుగు బిగ్‌బాస్ కొత్త సీజన్‌కు రంగం సిద్దమైంది. త్వరలోనే బిగ్‌బాస్ కొత్త సీజన్ ఆరంభం కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది. ఈ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారు.
అదే విధంగా వివాదంలో చిక్కుకున్న వారి లిస్ట్ కూడా చాలానే ఉంది. ఇక సారి జరగబోయే సీజన్‌లో టీవీ ఆర్టిస్టులతో పాటు, సినిమా వారిని కూడా అధిక సంఖ్యలో తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఈక్రమంలోనే ఓ హీరోయిన్ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ విస్మయ శ్రీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. చూడటానికి క్యూట్‌గా కనిపించే విస్మయ శ్రీ .. తెలుగులో మైల్స్ ఆఫ్ లవ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో, దిల్‌సే చిత్రాల్లో నటించింది.

ఇన్ని సినిమాలు చేసినా విస్మయకు టాలీవుడ్‌లో అంతగా గుర్తింపు రావడం లేదు. చాలా రోజులుగా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న విస్మయకు ఇంతలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. దీనివల్ల జనాలకు మరింత దగ్గరవచ్చని భావించిందో ఏమో కానీ వెంటనే ఆఫర్ ఓకే చేసిందట. ఖయూమ్, ఇంద్రనీల్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, యూట్యూబర్ బంచిక్ బబ్లు, ఆదిత్య ఓం, నిఖిల్ మిలిక్కల్, డ్యాన్సర్ నైనిక, రింగ్ రియాజ్, వర్షిణి సుందరరాజన్, రీతూ చౌదరి, అంబటి రాయుడు పేర్లు ఈసారి బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications