ప్రధాన మంత్రితో హీరోయిన్ ఎఫైర్ .. ప్రైవేట్ ఫొటోలు లీక్
సినీ పరిశ్రమ, ముఖ్యంగా బాలీవుడ్ అంటేనే రంగుల ప్రపంచం. తెరపై కనిపించే ప్రేమ కథల కంటే తెర వెనుక జరిగే రొమాన్స్, ఎఫైర్ల గురించి చర్చ సర్వసాధారణం. బాలీవుడ్‌లో ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని పెళ్లి చేసుకున్న ప్రముఖులు చాలా మందే ఉన్నారు. ఈ పరిణామాలను ఇండస్ట్రీలో 'మెచ్యూరిటీ' పేరుతో స్వీకరిస్తూ ఉంటారు.
దక్షిణాదిలో కొంత గోప్యత పాటించినా, బాలీవుడ్ మాత్రం ఎఫైర్ల విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. స్టార్ హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమ, డేటింగ్, బ్రేకప్‌లు, సీక్రెట్ రొమాన్స్‌ల గురించి రూమర్లు నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుత తరం నటీనటులు రిలేషన్షిప్‌ల గురించి, శృంగారం గురించి కూడా మీడియా వేదికలపై, ఇంటర్వ్యూలలో బహిరంగంగా మాట్లాడటానికి వెనుకాడకపోవడం ఈ ట్రెండ్‌లో వచ్చిన ప్రధాన మార్పుగా చెప్పవచ్చు.

ఇటువంటి విషయాలు ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అదనపు ఆసక్తిని రేకెత్తిస్తూ, బాలీవుడ్ వార్తలను ఎప్పుడూ హాట్‌గా ఉంచుతాయి. తెర మీద కెమిస్ట్రీ పండించే జంటల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులకు ఉండటం వల్ల, ఇటువంటి రూమర్లు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. తాజాగా ఓ పాప్ స్టార్ ఏకంగా దేశ ప్రధానితో అక్రమ సంబంధం పెట్టుకుందనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రపంచ పాప్ సంచలనం కేటీ పెర్రీ (40) , కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (53) మధ్య సాగుతున్న ప్రేమాయణం ఇప్పుడు బహిరంగ రహస్యమైంది. వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ, 2025 అక్టోబర్‌లో వీరి ప్రైవేట్ ఫొటోలు లీకై సోషల్ మీడియాలో కలకలం రేపాయి.
కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా తీరంలో, కేటీ పెర్రీ పడవలో ఈ జంట కెమెరాకు చిక్కింది. షర్ట్ లేకుండా ఉన్న ట్రూడో, బ్లాక్ స్విమ్‌సూట్‌లో ఉన్న కేటీ పెర్రీని గట్టిగా హత్తుకుని ముద్దుల్లో మునిగిపోయాడు. పక్కన టూరిస్ట్ బోటు ఉన్నా పట్టించుకోకుండా వీరు రొమాన్స్‌లో తేలిపోవడం విశేషం. ట్రూడో చేతిపై ఉన్న టాటూతో ఆయన్ని సులభంగా గుర్తించారు.
వీరి లవ్ ట్రాక్ 2025 వేసవిలో మొదలైంది. జూలైలో మాంట్రియల్‌లో డిన్నర్ డేట్‌లో కనిపించిన ఈ జంట, ఆ తర్వాత కేటీ పెర్రీ కన్సర్ట్‌లోనూ కలిసి పాల్గొన్నారు. 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ, ట్రూడో చాలా 'చార్మింగ్', 'హై-క్వాలిటీ పర్సన్' అని కేటీ పెర్రీ భావిస్తోందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఈ హాట్ ఫోటోలతో వీరిద్దరి రిలేషన్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయ్యింది.












Click it and Unblock the Notifications