ఆ హీరో అయితే లిప్ లాక్ ఇవ్వను ..తేల్చేసిన స్టార్ హీరోయిన్

ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్నాయి. నేటి తరం సినిమాల్లో ముద్దు సీన్లతో పాటు, శృంగారభరిత సన్నివేశాలతో నింపేస్తున్నారు. దీంతో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త. ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది.

గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు. కానీ నేటితరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషికం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ముద్దు సీన్లకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్టార్ హీరోకు ఊహించని షాకిచ్చింది ఓ హీరోయిన్. స్టార్ హీరో రిషి కపూర్‌ క్రేజ్ గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 1980ల్లో రిషి కపూర్‌ బాలీవుడ్‌ను షేక్ చేశారు. 70, 80వ దశకాల్లో రిషి కపూర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనమే సృష్టించాయి.

heroine who said that she wouldn t give a lip kiss to that hero

రిషి కపూర్‌‌తో నటించిన నటులకు, హీరోయిన్‌లకు కూడా ఫుల్ క్రేజ్ ఉండేది. అయితే ఓ హీరోయిన్ మాత్రం రిషి కపూర్‌‌తో ముద్దు సన్నివేశం నటించనని చెప్పి పెద్ద షాకిచ్చిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు...పద్మిని కొల్హాపురే. వీరిద్దరు కలిసి 'ప్రేమ్ రోగ్' అనే చిత్రంలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

అయితే ఈ సినిమాలో ఒక ముద్దు సన్నివేశం ఉండగా.. హీరోయిన్ పద్మిని అది చేయనని తెగేసి మరీ చెప్పేసిందట.ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సినిమాలో ఒక ముద్దు సన్నివేశం ఉంది. కానీ నేను స్పష్టంగా చేయనని చెప్పేశానని ఆెమె చెప్పుకొచ్చింది. దీంతో ఆ ముద్దు సన్నివేశం లేకుండానే ఈ సినిమాను తెరకెక్కించారట. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది.ప్రేమ్ రోగ్‌‌లో పద్మిని నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమెను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. 17 ఏళ్ల వయస్సులోనే ఆమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. దర్శకుడు రాజ్ కపూర్ ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా.. ఉత్తమ ఎడిటర్‌గా అవార్డులు అందుకున్నారు.

'ప్రేమ్ రోగ్' సినిమాలో పద్మిని కొల్హాపురే నటన అద్భుతంగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఆమెను రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా మార్చింది. కేవలం 17 ఏళ్ల వయస్సులోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజ్ కపూర్ ఉత్తమ దర్శకుడిగా , ఉత్తమ ఎడిటర్‌గా కూడా అవార్డులు అందుకున్నారు. ఈ చిత్రం పద్మిని కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+