షేక్ హ్యాండ్ వద్దు..ముద్దుకు మాత్రం ఓకే..నిత్యా మీనన్ సంచలనం
మలయాళ కుట్టి నిత్యా మీనన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ''అలా మొదలైంది'' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నిత్యా మీనన్, తెలుగుతో పాటు, తమిళంలో కూడా నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.ఇటీవల జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ధనుష్ హీరోగా నటించిన ''తిరు'' సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో నటనగాను నిత్యా మీనన్ జాతీయ అవార్డు గెలుకున్నారు.
மிஷ்கினுக்கு முத்தமிட்ட நித்யா மேனன்!
— IndiaGlitz - Tamil (@igtamil) January 7, 2025
தயவு செஞ்சி என்னை தொடாதீங்க! pic.twitter.com/ivwzqyJJOf
కథ నచ్చితే కానీ నిత్యా మీనన్ సినిమాను ఓకే చేయరు. కథలో తనకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటారు. నిత్యా మీనన్‌లో సింగర్ కూడా ఉందనే విషయం అందరికి తెలిసిందే.ఇదిలా ఉంటే నిత్యా మీనన్ తాజాగా చేసిన ఓ పని అందర్ని ఆశ్చర్యపరిచింది. నిత్యా మీనన్ ప్రస్తుతం జయం రవితో 'కార్ధికాక నేరమల్లి' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ప్రత్యేక అతిథిగా వచ్చిన దర్శకుడు మిష్కిన్‌ని చూడగానే నిత్యా మీనన్ పరిగెత్తుకుంటూ వెళ్లి అతని బుగ్గ మీద ముద్దుపెట్టుకుంది.

దర్శకుడు మిష్కిన్ సైతంఆమె చేయి పట్టుకుని ముద్దులు పెడుతూ తలపై ముద్దు పెట్టుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కొంతమంది అందులో తప్పు ఏముందని ప్రశ్నిస్తుంటే, మరికొందరు పబ్లిక్ ప్లేస్‌లో ఎలా ఉండాలో తెలియదా అంటూ నిత్యా మీనన్ ఫైర్ అవుతున్నారు.అయితే గతంలో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడని నిత్యా మీనన్, ఇప్పుడు ఎలా ముద్దులిచ్చిందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నిత్యా మీనన్ దర్వకుడికి ముద్దులు పెట్టిన వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications