ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..!
ఇటీవలికాలంలో తెలుగులో చిన్న సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది చాలా చిన్న సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై భారీ విజయాన్ని నమోదు చేశాయి. కోర్ట్, మ్యాడ్ స్క్వేర్, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, శంబాల తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. పెద్ద పెద్ద సినిమాలపై అంచనాలు పెరిగిపోయి.. ప్రేక్షకులు ఆశించినంత సబ్జెక్ట్ సినిమాలో లేకపోవడంతో అవి చతికిల పడుతున్నాయి. కానీ చిన్న సినిమాలు సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టేస్తున్నాయి.
ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో 'హే బలవంత్' మూవీ ఒకటి. ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైన 'హే బలవంత్' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మూవీలో ఓ వినూత్నమైన కాన్సెప్ట్ తోపాటుగా కామెడీ చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ మూవీలో కొంచెం అడల్ట్ టచ్ ఉన్న కారణంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. ఈ మూవీలో సుహాస్, లిటిల్ హార్ట్స్ హీరోయిన్ శివానీ నగారం లీడ్ రోల్స్ లో నటించారు. ఇక టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు.

ఇక 'హే బలవంత్' మూవీ మార్చి 31 ఓటీటీలో అందుబాటులోకి రానుంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. కృష్ణ(సుహాస్) కు తన తండ్రి(నరేష్) లా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరిక ఉంటుంది. కృష్ణ పెద్దయ్యాక తన తండ్రి బిజినెస్ ఏంటో తెలుస్తుంది. అయితే తన తండ్రి విషయాన్ని అంగీకరించడానికి కృష్ణ ఇబ్బంది పడతాడు. అయితే అప్పటికే తాను ప్రేమిస్తున్న మిత్ర(శివాని నగారం)కు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు కృష్ణ. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి..? చివరకి కృష్ణ, మిత్ర ఒక్కటయ్యారా..? లేదా..? అనేది స్టోరీ..












Click it and Unblock the Notifications