Hi Movie Review: నయనతార 'హాయ్' రివ్యూ.. రొటీన్ లవ్‌స్టోరీ మెప్పించిందా!
Hi Movie Review: లేడీ సూపర్ స్టార్ నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం 'హాయ్'. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నేడు(ఆగస్టు 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా పాత మూసధోరణిలో సాగే ఈ లవ్ స్టోరీ సినీ అభిమానులను ఎంతమేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
స్టోరీ
మయిల్ స్వామి(కవిన్) ప్రేమలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత అతని జీవితంలోకి దేవయాని(నయనతార) వస్తుంది. ఆమెతో మయిల్ స్వామికి ఏర్పడిన పరిచయం.. ఆపై అది నిజమైన ప్రేమగా ఎలా మారింది? వీరిద్దరి మధ్య ఎదురైన పరిస్థితులేంటి? చివరకు దేవయాని అతని ప్రేమను ఎలా అంగీకరించింది అనేది చూడాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు ఎలా ఉందంటే?
లేడీ సూపర్ స్టార్ నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పటిలాగే బాగుంది. అయితే ఆమెకు లభించిన పాత్ర చాలా సాధారణమైనది కావడం.. గతంలో ఇలాంటి పాత్రలు ఆమె ఎన్నో చేయడంతో నటన పరంగా కొత్తగా నిరూపించుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. యువ నటుడు కవిన్ లుక్స్ పరంగా, నటనపరంగా తన పరిధి మేరకు చక్కగా రాణించాడు. ఇక సహాయ నటుల విషయానికొస్తే రాధికా శరత్ కుమార్, ప్రభు, భాగ్యరాజ్ వంటి సీనియయర్ నటులను డైరెక్టర్ సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. వీటీవీ గణేష్ ఒక్క సన్నివేశానికి పరిమితమవ్వగా.. మిగతా కామెటీ నటులు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
సాంకేతిక విభాగం
డైరెక్టర్ విష్ణు ఎడవన్ ఎంచుకున్న కథ, కథనాలు దశాబ్దాల కాలం నాటి రొటీన్ ఫార్ములాలోనే సాగుతాయి. హీరో లవ్ ఫెయిల్యూర్, ఆ వెంటనే వచ్చే సూసైడ్ డ్రామా వంటి ప్రతి సీన్ ప్రేక్షకులకు ఇది వరకే ఎక్కడో చూశామనే భావనను కలిగిస్తుంది. ఈ చిత్రంలో నటీనటులు కొత్తవారైనా సీన్లలో ఏ మాత్రం తాజాదనం కనిపించదు. సెకండాఫ్‌లో వచ్చే ప్రెగ్నెన్సీ కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. క్లైమాక్స్ కూడా పూర్తి డ్రామాతో అంచనాలకు తగినట్లే సాగి నిరాశపరుస్తుంది. జెన్ మార్టిన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కేవలం సీన్లకు సరిపోయేలా ఉన్నాయే తప్ప గుర్తుండిపోయేలా లేవు. రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ సినిమాను విజువల్‌గా రిచ్‌గా చూపించడంలో విజయవంతమైంది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఫస్థాఫ్‌ను క్రిస్ప్‌గా ఉంచినప్పటికీ.. సెకండాఫ్‌లో స్టోరీ లోపాల వల్ల సాగదీతగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.
ఫైనల్‌గా.
'హాయ్' అనేది ఏమాత్రం కొత్తదనం లేని ముందే ఊహించగలిగే సీన్లతో సాగే ఓ రొటీన్ లవ్ స్టోరీ. నయనతార, కవిన్ లీడ్ పెయిర్ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్లు ఏమీ లేవు. రొటీన్ ఫార్ములా ప్రేమ కథలను ఇష్టపడేవారికి తప్ప.. కొత్తదనం కోరుకునే సగటు సినిమా ప్రేమికుడిగా ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు.
*రేటింగ్: 2/5.














Click it and Unblock the Notifications