శృంగారం చేయ్ కానీ , ఆ తప్పు మాత్రం చేయకని మా అమ్మ చెప్పింది.. స్టార్ హీరోయిన్
హిందీ సీరియల్స్‌లో తనదైన శైలిలో రాణిస్తూ ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకుంది "రోష్ని వాలియా ". ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ భామ తన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ విషయాలను, కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అంతే కాకుండా ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాల గురించి కూడా ఓపెన్ అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించిన రోష్ని.. తన విజయంలో తల్లి చేసిన త్యాగం ఎంతో ఉందని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. మరీ ముఖ్యంగా సెక్స్ గురించి ఈ ముద్దుగుమ్మ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తల్లి త్యాగమే విజయానికి కారణం..
రోష్ని మాట్లాడుతూ.. మా అమ్మ ఊరిని వదిలి ముంబైకి రాకపోతే నేను ఈరోజు ఇంత స్థాయికి రాలేక పోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. సెట్‌లలో చిన్న వయసులోనే పెద్దవాళ్ల మధ్య ఉండాల్సి వచ్చిందని.. దాంతో జీవితంలో చాలా విషయాలు ముందే నేర్చుకున్నానంది. ఇండస్ట్రీలో ఎవరు నిజంగా మన కోసం ఆలోచిస్తున్నారు.. ఎవరు కేవలం ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అన్నది త్వరగానే అర్థమైపోయిందని తెలిపింది. అక్కడ జరిగే పాలిటిక్స్, పోటీలు, ఇన్‌సెక్యూరిటీ అన్నీ త్వరగానే అర్థమైపోయాయని వివరించింది.

ట్రెండీ మామ్..
అలానే తల్లి తనతో ఎంత ఫ్రీ గా ఉంటుంది అనే విషయం గురించి ప్రశ్నించగా.. రోష్ని ఇచ్చిన ఆన్సర్ అందరినీ షాక్ కి గురి చేస్తుంది. మా అమ్మ చాలా మోడ్రన్‌గా ఉంటుంది. లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి అని పదే పదే చెబుతుంది. సెక్స్ చేస్తే తప్పు లేదు కానీ ప్రొటెక్షన్ తప్పనిసరిగా వాడాలి అని అక్కకు పదేపదే చెప్పేది.. ఇప్పుడు నాకు కూడా అదే చెబుతుంది అంటూ తెలిపింది. అంతే కాకుండా ఇంట్లో కూర్చోకుండా బయటకి వెళ్లి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవాలని కూడా ప్రోత్సహిస్తుంది. ఈరోజు ఎందుకు ఇలా ఉన్నావ్? తాగలేదా? అని కూడా అడుగుతుంది అని రోష్ని చెప్పింది.
దీంతో రోష్ని చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. కొందరు పిల్లలతో ఇలా ఫ్రాంక్‌గా ఉండటం మంచిదే అని సపోర్ట్ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి అమ్మడు చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ఆమె కెరీర్ పై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో అని చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications