చిన్న సినిమా హవా.. రూ.7.5 కోట్ల బడ్జెట్.. రూ.3,100 కోట్ల వసూళ్లు!

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ సంచలనం 'ఆబ్సెషన్'(Obsession). కేవలం రూ.7.5 కోట్ల(7.50 లక్షల డాలర్లు) అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.3,100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. కేవలం అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా భారతీయ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఇండియాలో దాదాపు రూ.80 కోట్ల నెట్ కలెక్షన్లతో 2026 సంవత్సరానికి గాను అత్యధిక వసూళ్లు సాధించిన నంబర్ వన్ హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. అయితే ఈ ఊహించని భారీ విజయంపై చిత్ర దర్శకుడు కర్రీ బార్కర్ తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యాడు.

'ఇండియాలో ఇంత పెద్ద హిట్ అవుతుందని అస్సలు అనుకోలేదు'
కేవలం 26 ఏళ్ల వయసున్న యూట్యూబర్, దర్శకుడు కర్రీ బార్కర్‌కు ఇది మొదటి ఫీచర్ ఫిల్మ్ కావడం విశేషం. ఇండియాలో తన సినిమా సాధించిన అద్భుతమైన విజయంపై ఆయన స్పందిస్తూ.. "నా సినిమా భారత్‌లో ఇంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటుందని నేను కలలో కూడా ఊహించలేదు. నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ స్థాయి సక్సెస్ వస్తుందని అనుకోలేదు. మనం తీసిన సినిమా బాగుండాలని, ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలని ఎప్పుడూ కోరుకుంటాం, కానీ ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే నాకే నమ్మకం కలగడం లేదు" అని ఆనందం వ్యక్తం చేశాడు.

Hollywood Movie Obsession Box Office 750K Budget Film Grosses Over Rs 3100 Cr Full Details

బడ్జెట్ కంటే 10 రెట్లు ఎక్కువగా.. ఇండియాలోనే వసూళ్లు!
దాదాపు ఎలాంటి ఖర్చు లేకుండా, అత్యంత పరిమిత వనరులతో తాము ఈ చిత్రాన్ని నిర్మించామని బార్కర్ పేర్కొన్నాడు. ఈ సినిమా కేవలం ఇండియాలోనే తన మొత్తం బడ్జెట్ కంటే 10 రెట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. బాక్సాఫీస్ నెంబర్ల కంటే కూడా ఈ సినిమా సృష్టించిన కల్చరల్ ఇంపాక్ట్ తనను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆయన అన్నాడు. సోషల్ మీడియాలో ప్రేక్షకులు ఈ సినిమా సీన్లపై చేస్తున్న కామెడీ వీడియోలు, రీ-క్రియేషన్లు, ఫ్యాన్ ఆర్ట్‌లను చూడటం తనకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తోందని వెల్లడించాడు.

బాలీవుడ్ చిత్రాల కంటే మిన్నగా.
ఇండియాలో 'ఆబ్సెషన్' చిత్రం హవా ఏ స్థాయిలో ఉందంటే.. విడుదలై రెండు వారాలు గడిచినా థియేటర్లలో పలు బాలీవుడ్ చిత్రాల కంటే ఎక్కువ కలెక్షన్లను సాధించింది. ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ రూపొందించిన 'మై వాపస్ ఆవుంగా' సినిమా విడుదలైన వీకెండ్‌లో కూడా దాని కంటే ఈ హాలీవుడ్ చిత్రమే అత్యధిక వసూళ్లను నమోదు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇంతియాజ్ అలీ చిత్రం రెండో వారంలో పుంజుకుని మంచి వసూళ్లు సాధిస్తున్నప్పటికీ.. 'ఆబ్సెషన్' క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం ఇండియన్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+