యథార్థగాథల ఆధారంగా తెరకెక్కిన అతి భయంకరమైన హారర్ సినిమాలు!
సినిమాల్లో చూపించే దెయ్యాలు, అతీంద్రియ శక్తుల కథలు కొన్ని కల్పితమే కావచ్చు.. కానీ నిజ జీవితంలో ఎదురైన పారానార్మల్ అనుభవాలు, ఒళ్లు గగుర్పొడిచే క్రైమ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు చూస్తుంటే కలిగే భయం మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఇవన్నీ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ హాలోవీన్ సీజన్లో చూసి తీరాల్సిన, చెమటలు పట్టించే 10 నిజ జీవిత హారర్ చిత్రాల జాబితా చూద్దాం.
1. ది అన్బార్న్ చైల్డ్ (2011)
2010లో బ్యాంకాక్‌లోని ఒక గుడి ప్రాంగణంలో దాదాపు 2,000కు పైగా పిండాల అస్థిపంజరాలు బయటపడటం సంచలనం సృష్టించింది. ఆ షాకింగ్ నిజ జీవిత స్క్యాండల్ను సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్‌గా మలచి ఈ థాయ్ సినిమాను రూపొందించారు.

2. అన్నాబెల్లె (2014)
ఒక 'రాగెడీ ఆన్' బొమ్మకు దెయ్యం పట్టిందంటూ ప్రసిద్ధ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఎడ్, లొరైన్ వారెన్ నమ్మిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను భయాందోళనలకు గురిచేసిన కథల్లో ఇది ఒకటి.
3. ది కంజురింగ్ (2013)
1970ల కాలంలో రోడ్ ఐలాండ్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో 'పెరాన్' కుటుంబానికి ఎదురైన తీవ్ర భయాందోళనకర అనుభవాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ కేసు కూడా అప్పట్లో ఎడ్, లొరైన్ వారెన్‌ల దృష్టిని ఆకర్షించింది.
4. ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ (2005)
జర్మనీకి చెందిన 'అన్నెలీస్ మిచెల్' అనే యువతి కథ ఆధారంగా తీసిన కోర్ట్‌రూమ్ హారర్ డ్రామా ఇది. దెయ్యాన్ని వదిలించే క్రమంలో జరిపిన పూజలు వికటించి 1976లో ఆమె ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన ఆధారంగా దీనిని తెరకెక్కించారు.
5. ఓపెన్ వాటర్ (2003)
1998లో ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్లో టామ్, ఐలీన్ అనే ఇద్దరు డైవర్లు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. విశాలమైన సముద్రంలో అనుకోకుండా ఒంటరిగా మిగిలిపోతే కలిగే భయాన్ని, నిస్సహాయతను ఈ సర్వైవల్ థ్రిల్లర్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా చూపించారు.
6. భూత్: పార్ట్ వన్ - ది హాంటెడ్ షిప్ (2020)
2011లో ముంబైలోని జుహు బీచ్‌కు కొట్టుకొచ్చిన 'ఎంవీ విజ్డమ్' అనే నిర్జన కార్గో షిప్ సంఘటన ఆధారంగా ఈ బాలీవుడ్ హారర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించారు.
7. ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్ (2009)
1980లలో ముంబై వీధుల్లో నిద్రించే నిరాశ్రయులను దారుణంగా హతమార్చిన ఒక సీరియల్ కిల్లర్ మిస్టరీ ఆధారంగా ఈ క్రైమ్ హారర్ థ్రిల్లర్ రూపుదిద్దుకుంది.
8. డెత్ విస్పరర్ (టీ యోడ్ - 2023)
1970లలో తన తల్లికి ఎదురైన ఒక భయంకరమైన కుటుంబ ఘటనను ఆధారంగా చేసుకుని రచయిత క్రిత్తనాన్ రాసిన కథతో ఈ థాయ్ హారర్ చిత్రం నిర్మితమైంది.
9. వినా: బిఫోర్ 7 డేస్ (2024)
ఇండోనేషియాలో తీవ్ర కలకలం రేపిన వినా దేవి అర్సిటా, ఆమె బాయ్‌ఫ్రెండ్ దారుణ హత్య కేసు ఆధారంగా రూపొందిన చిత్రం. ఈ నిజ జీవిత నేరానికి ఆత్మల విచారణ అనే కల్పిత అతీంద్రియ కోణాన్ని జోడించి తెరకెక్కించారు.
10. అమిటీవిల్లే హారర్ (1979)
1974లో డిఫియో కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఒకే ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి నివాసానికి వచ్చిన లట్జ్ కుటుంబానికి ఎదురైన పారానార్మల్ అనుభవాల సమ్మేళనమే ఈ హారర్ క్లాసిక్.














Click it and Unblock the Notifications
