ఉపాసన క్రిస్మస్ డ్రస్ ఖరీదు ఎంతో తెలుసా?
సెలబ్రిటీలు అంటేనే వారి జీవితమంతా జిగేల్ జిగేల్ మని వెలుగుతూ ఉంటుంది. అత్యంత ఖరీదైన జీవితాన్ని గడుపుతారు. వారు వేసుకునే దుస్తుల నుంచి చెప్పుల వరకు ప్రతిదీ బ్రాండెడ్ వస్తువులే వేసుకుంటారు. వాటికి మీడియాలో ఎంతో ప్రచారం లభిస్తుంటుంది. అందుకే సెలబ్రిటీల అలవాట్లు ఏమిటి? వారు ఎటువంటి దుస్తులు ధరిస్తారు?.. ఇలా ప్రతి విషయాన్ని అభిమానులు కూలంకుషంగా తెలుసుకుంటుంటారు.
ఖరీదు తక్కువగా ఉండే దుస్తులు ధరించడాన్ని ఇష్టపడరు. చెప్పులు, షూస్, వాచ్.. ఇలా అన్నీ చాలా ఖరీదుగా ఉండాలి. వాటి ధరలు మనం ఊహించలేని విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన దుస్తులు, వస్తువుల.. ఇతరత్రాలన్నీ సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. ఇప్పుడు మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ధరించే దుస్తుల గురించి తెలుసుకుందాం.

ఇటీవలే మెగా కుటుంబం క్రిస్మస్ పండగను బాగా జరుపుకున్నారు. మెగా హీరోలు, అల్లు హీరోలు వారి వారి భార్యలతో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. ఈ వేడుకలో ఉపాసన ధరించిన డ్రెస్ అందరినీ ఆకర్షించింది. లగ్జరీ బ్రాండ్ గూచీకి సంబంధించి బ్రాండ్ బట్టల్లో మెరిసిపోయారు. వాటి ధర అక్షరాలా రూ.3 లక్షలు అని తెలుస్తోంది. దీన్నిగురించి తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఉపాసనతోపాటు ఈ వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా పాల్గొన్నారు. వీరితోపాటు మెగావారి కొత్త కోడలు లావణ్య త్రిపాఠి కూడా హాజరై క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications