థియేటర్లు తగలబడడం పక్కా.. హృతిక్, ఎన్టీఆర్ " వార్ 2 " ట్రైలర్ రిలీజ్ !
గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న చిత్రం 'వార్ 2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 'వార్' సినిమాకు సీక్వెల్‌గా వస్తుంది. భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గానే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళంలో ఈ ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్, హృతిక్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ట్రైలర్ లోనే కొన్ని ట్విస్ట్ లను సైతం రివీల్ చేసినట్టు కనబడుతుంది. ట్రైలర్ ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా..
ట్రైలర్ ఎలా ఉందంటే..?
నేను అన్నీ వదిలేసి నీడలా మారిపోతాను.. కంటికి కనిపించని త్యాగాలను చేస్తాను.. చివరకు ప్రేమను కూడా వదిలేస్తాను.. అంటూ హృతిక్ రోషన్ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత నేను మాటిస్తున్నాను.. ఎవ్వరూ చేయలేని పనులను నేను చేస్తాను.. ఎవ్వరూ చేయని యుద్ధాన్ని నేను చేస్తాను.. అంటూ ఎన్టీఆర్ కనిపిస్తారు. ఈ గ్యాప్ లోనే వారి వారి శైలిలో యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టారు. ఇద్దరి పాత్రలకు సమన్యాయం చేసినట్టు కనిపించింది. అలానే ఇద్దరూ ఫైట్ చేసే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
హృతిక్ రోషన్, కియారా రొమాన్స్ కూడా ఇందులో హైలెట్ కాబోతోందని అనిపిస్తుంది. అయితే హృతిక్ - కియారా ఫైట్ చేసుకోవడం పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. విజువల్స్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కూడా మ్యాజిక్ చేసేశారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ మూవీలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య అదిరిపోయే డ్యాన్స్ సీక్వెన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారట. తమకి తామే పోటీ అనేలా చెలరేగే ఈ ఇద్దరు డాన్సర్లు.. ఈసారి కలిసి డాన్స్ చేస్తే థియేటర్లు తగాలబడిపోవడం గ్యారంటీ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. కొమురం భీమ్ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో.. ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యారు. రీసెంట్ గానే ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా తారక్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం కావడంలో మూవీపై ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications