ముంబై మెట్రో ట్రైన్‌లో ప్రయాణించిన హృతిక్ రోషన్...
ఆర్థిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు మెట్రో ట్రైన్లను ప్రవేశపెట్టారు. మెట్రోల వల్ల తక్కువ సమయంలో ఎలాంటి సుదూర గమ్యస్థానాలకైనా త్వరగా చేరుకోవచ్చు. అందుకే ఎక్కువ శాతం మంది ప్రజలు మెట్రో మార్గాలనే ఎంపిక చేసుకుంటారు. సాధారణ ప్రజలే కాకుండా అప్పుడప్పుడు సెలబ్రిటీలు సైతం ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారు.
తాజాగా మెట్రోలో అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ముంబై మెట్రో ట్రైన్‌లో ప్రయాణం చేశారు. షూటింగ్ ప్రదేశానికి సమయానికి చేరుకునేందుకు హృతిక్ రోషన్ మెట్రో ట్రైన్‌లో వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హృతిక్ సోషల్ మీడియాలోని తన ఖాతాలో షేర్ చేశాడు. ఇప్పడు ఈ ఫోటోలు కాస్తా నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.

విక్రమ్ వేధ నిరాశపరించింది : అయితే, చివరగా హృతిక్ రోషన్ నటించిన బాలీవుడ్ సినిమా విక్రమ్ వేధ. ఈ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ చిత్రం ఆశించిన ఫలితాలు దక్కలేదు. అయితే ఎంతో కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హృతిక్ రోషన్ తాజాగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ ఆఫ్ ఫైటర్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు.
ఈ సినిమాలో దీపికా పదుకోనే ఫీమేల్ లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం శుక్రవారం మెట్రో ట్రైన్‌లో హృతిక్ ప్రయాణించినట్లు తెలుస్తోంది. మెట్రో ప్రయాణంలో తనకు ఎన్నో మధురమైన వ్యక్తులను కలిపిందని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు హృతిక్. ఈ మెట్రో ప్రయాణంలో అనేక మంది అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు కూడా ఉత్సాహం చూపించారు. అభిమానులతో దిగిన ఫొటోలను హృతిక్ నెట్టింట షేర్ చేశారు.
Took the metro to work today.
— Hrithik Roshan (@iHrithik) October 13, 2023
Met some really sweet n kind folks. Sharing with you the love they gave me.
The experience was spectacular. Beat the heat + the traffic. Saved my back for the action shoot I’m going for. pic.twitter.com/EidPYhNVz2
ఇదో అద్భుతమైన అనుభవం : యాక్షన్ సన్నివేశాల ముందు ట్రాఫిక్‌లో చిక్కుకుని వెన్నునొప్పి తెచ్చుకోవడం కంటే ఇలా మెట్రో ట్రైన్‌లో ప్రయాణించడం ఉత్తమమంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. మెట్రో ప్రయాణికులు తనపై ఎంతో అభిమానం కురిపించారని ఈసందర్భంగా చెప్పుకొచ్చారు. మెట్రో ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవమని పేర్కొన్నారు. ఎండవేడి, ట్రాఫిక్ సమస్య ఒకేసారి తప్పిపోయాయని సోషల్‌మీడియాలోని తన ఖాతాలో కామెంట్ చేశారు. ఇక మెట్రో ట్రైన్‌లో హృతిక్ దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications