ప్రేక్షుకుల ముందుకొచ్చిన మిస్టరీ థ్రిల్లర్
టాలెంటెడ్ హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ 'హంటర్ చాప్టర్ 1' చిత్రం ఈరోజు, జూన్ 13న, అంగరంగ వైభవంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను, ఉత్సాహాన్ని నింపి సినిమాపై బజ్‌ను పెంచాయి.
ఈ చిత్రంలో నందిత శ్వేతా మరియు తాన్య హోప్ కథానాయికలుగా నటించారు. షెరీఫ్ గౌస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎ. రాజశేఖర్ & సాయి కిరణ్ బత్తుల నిర్మించారు. అర్రోల్ కొరెల్లి అందించిన సంగీతం, బాలాజీ కె రాజా సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాయి.

సస్పెన్స్, థ్రిల్, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన 'హంటర్ చాప్టర్ 1' ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. మిస్టరీని ఛేదించే హీరో ప్రయాణం, ఊహించని మలుపులు, చివరి వరకు ఉత్కంఠను రేపే కథనంతో ఈ సినిమా ప్రేక్షకులను సీట్లలో కట్టిపడేస్తుందని భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా థియేటర్లలో నేటి నుంచి ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం, థ్రిల్లర్ ప్రియులకు ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైభవ్ నటన, నందిత శ్వేతా, తాన్య హోప్ గ్లామర్, దర్శకుడు షెరీఫ్ గౌస్ టేకింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలుస్తాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి 'హంటర్ చాప్టర్ 1' ప్రేక్షకుల అంచనాలను ఎంత మేరకు చేరుకుంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications