కుర్రాళ్లు ఎగబడి చూసిన తెలుగు అడల్ట్ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి.. మిస్ కావొద్దు..!
ఇటీవలికాలంలో చిన్న సినిమాలదే హవా కొనసాగుతోంది. ఓ పక్క పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్నాయి. మరోవైపు చిన్న సినిమాలు కంటెంట్ తో వచ్చి థియేటర్లలో సైలెంట్ గా హిట్ అవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. కపుల్ ఫ్రెండ్లీ, లిటిల్ హార్ట్స్, శంభాల నుంచి ఇటీవల రిలీజ్ అయిన హనుమాన్ అంశ్ వరకూ అనేక చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకున్నాయి. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. అలాంటి సినిమాల్లో ఇటీవల ప్రేక్షకుల్ని ముఖ్యంగా యూత్ ను బాగా ఆక్టట్టుకున్న మూవీ 'హుషార్ పిట్టలు'
యూత్ ఫుల్ అడల్ట్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిన్న సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సైలెంట్ గా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మౌత్ టాక్ తోనే క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీలోని అడల్ట్ కామెడీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించాయి. దీంతో ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. థియేటర్లలో ఉర్రూతలూగించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. హుషార్ పిట్టలు సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో సినిమా మిస్ అయినవాళ్లు ఇంట్లోనే ఎంచక్కా ఈ మూవీని చూసేయొచ్చు.

ఇక ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీలో అన్షు, వాసవి గణేషన్ జంటగా నటించారు. బిక్షు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రేమ, స్నేహం, ఎట్రాక్షన్, యూత్ లైఫ్ తో పాటు ఎమోషన్స్ కు ప్రాధాన్యతను ఇస్తూ దర్శకుడు కథను రూపొందించిన విధానం ఆకట్టుకుంటోంది. హుషార్ పిట్టలు సినిమాను పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్ పై వెంకట్ యాదవ్ నిర్మించారు. ఇక థియేటర్లో ఈ మూవీ మిస్ అయినవాళ్లు ఇప్పుడే చూసేయండి.












Click it and Unblock the Notifications
