రోజా ఓటమిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..!
హైపర్ ఆది పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోలో తనదైనశైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది తరువాత టీం లీడర్‌గా ఎదిగాడు. తన స్కిట్‌లను తానే రాసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్‌నే తన ఇంటి పేరు మార్చుకున్న ఆది.. తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతుంటాడు. జబర్దస్త్‌తో పాటు, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు.
అయితే ఇదే సమయంలో మనోడుపై తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి. తన స్కిట్స్‌లో అమ్మాయిలను చులకనగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటివి చేస్తుంటాడు. దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తుంటాడు. ఇదిలా ఉంటే హైపర్ ఆది మెగా అభిమాని అనే అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్‌పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు.

సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది మద్దతుగా నిలుస్తుంటాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున ఆయన విసృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో జబర్దస్త్ షో జడ్జ్ రోజాపై కూడా హైపర్ ఆది విమర్శలు చేయడం జరిగింది. ఎన్నికల్లో జనసేన గెలవడంతో పాటు, మంత్రిగా పోటీ చేసిన రోజా సైతం ఓడిపోయారు. రోజాకు పొలిటికల్‌గా జరిగిన డ్యామేజ్ కన్నా కూడా జబర్దస్త్ షోలో కమెడియన్స్ చేసిన డ్యామేజ్ ఎక్కువ అని ప్రచారం జరిగింది.
ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి రోజా గురించి హైపర్ ఆది మాట్లాడాడు. ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన హైపర్ ఆది రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల ఫలితాల తర్వాత రోజాపై మీ అభిప్రాయం ఏంటని ఆదిని ప్రశ్నించగా, ఆయన మాట్లాడుతూ రోజాకు జగన్ అంటే ఇష్టం, నాకు పవన్ అంటే ఎక్కువ ఇష్టం. ఎవరి ఇష్టాలు వారివి, ఆమె అంటే నాకు ఎప్పుడూ గౌరవమే ఉంటుంది. నాకు ఇంత పేరు రావడానికి ఆమె కూడా ఓ కారణమని ఆది చెప్పుకొచ్చాడు.రాజకీయాలకు అతీతంగా ఆమెపై నాకు గౌరవం ఎప్పుడు ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం ఆది రోజాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications