పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన ఇచ్చిన హైపర్ ఆది
హైపర్ ఆది పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు. జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోలో తనదైనశైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది తరువాత టీం లీడర్‌గా ఎదిగాడు. తన స్కిట్‌లను తానే రాసుకొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్‌నే తన ఇంటి పేరు మార్చుకున్న ఆది..తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతుంటాడు. జబర్దస్త్‌తో పాటు, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు.
అయితే ఇదే సమయంలో మనోడుపై తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి. తన స్కిట్స్‌లో అమ్మాయిలను చులకనగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటివి చేస్తుంటాడు. దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తుంటాడు. ఇదిలా ఉంటే హైపర్ ఆది మెగా అభిమాని అనే అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్‌పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు.

సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది మద్దతుగా నిలుస్తుంటాడు. గత ఎన్నికల్లో జనసేన తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన హైపర్ ఆది..ఇప్పుడు సడన్‌గా కనిపించడం మానేశాడు. కొద్దికాలం క్రితం వరకు కూడా పవన్ కల్యాణ్ నిర్వహించిన సభల్లో హైపర్ ఆది సందడి చేశాడు.తన స్పీచ్‌తో జనసేన కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపిన హైపర్ ఆది అధికార పార్టీకి చెందిన నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఏం జరిగిందో తెలియదు కానీ ..అనూహ్యంగా పార్టీలో కనిపించడం లేదు. గతంలో పవన్ కల్యాణ్ గెలుపుకు తనవంతు సాయం చేస్తానని మాటిచ్చిన హైపర్ ఆది.. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడిన ఎక్కడా కనిపించడం లేదు.

టీడీపీతో జనసేన పొత్తు కారణంగానే హైపర్ ఆది పవన్‌కు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. గతంలో టీడీపీ నాయకులు పవన్ కుటుంబంపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకులతో కలిసి వేదిక పంచుకోలేకనే హైపర్ ఆది జనసేనకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైపర్ ఆది సినిమాల్లో బిజీగా ఉండటం వల్లే జనసేనకు ప్రచారం చేయలేకపోతున్నారని..సమయం కుదిరితే తప్పకుండా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఉంటారని హైపర్ ఆది సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి కీలక సమయంలో పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది హ్యాండ్ ఇచ్చారనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications