Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోజాపై హైపర్ ఆది కామెంట్స్..తప్పు అక్కడే జరిగిందంటూ వివరణ

హైపర్ ఆది పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు. జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోలో తనదైనశైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది తరువాత టీం లీడర్‌గా ఎదిగాడు. తన స్కిట్‌లను తానే రాసుకొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్‌నే తన ఇంటి పేరు మార్చుకున్న ఆది..తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతుంటాడు. జబర్దస్త్‌తో పాటు, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు.

అయితే ఇదే సమయంలో మనోడుపై తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి. తన స్కిట్స్‌లో అమ్మాయిలను చులకనగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటివి చేస్తుంటాడు. దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తుంటాడు. ఇదిలా ఉంటే హైపర్ ఆది మెగా అభిమాని అనే అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్‌పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు.

Hyper Adi s comments on ex-minister Roja went viral

సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది మద్దతుగా నిలుస్తుంటాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరుఫున ఆయన విసృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సమయంలో జబర్దస్త్ షో జడ్జ్ రోజాపై కూడా హైపర్ ఆది విమర్శలు చేయడం జరిగింది. ఎన్నికల్లో జనసేన గెలవడంతో పాటు, మంత్రిగా పోటీ చేసిన రోజా సైతం ఓడిపోయారు. రోజాకు పొలిటికల్‌గా జరిగిన డ్యామేజ్ కన్నా కూడా జబర్దస్త్ షో‌లో కమెడియన్స్ చేసిన డ్యామేజ్ ఎక్కువ అని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై హైపర్ ఆది రియాక్ట్ అయ్యాడు. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన 'కేశవ చంద్ర రమావత్' అనే సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఆదితో పాటు రోజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హైపర్ ఆది తన ప్రసంగంలో రోజా గురించి ప్రస్తావించాడు. "రోజాను హైపర్ ఆది ఏమని తిట్టాడో తెలుసా" అంటూ థంబ్ నైల్స్ పెట్టి యూట్యూబ్ వాళ్లు వైరల్ చేస్తుంటారని.. వ్యూస్ కోసం వాళ్లు అలా చేస్తుంటారే తప్ప తాను ఇప్పటిదాకా ఎన్నడూ రోజాను ఒక్క మాట కూడా అనలేదని స్పష్టం చేశాడు ఆది. అటు రోజా సైతం హైపర్ ఆది మాట్లాడుతున్న సమయంలో నవ్వుతూనే కనిపించారు. దీంతో ఇదింతా కూడా యూట్యూబ్ ఛానెల్స్ సృష్టించిన గొడవే అని స్పష్టం చేసినట్టు అయింది.

గతంలో కూడా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన హైపర్ ఆది.. రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల ఫలితాల తర్వాత రోజాపై మీ అభిప్రాయం ఏంటని ఆదిని ప్రశ్నించగా, ఆయన మాట్లాడుతూ రోజాకు జగన్ అంటే ఇష్టం, నాకు పవన్ అంటే ఎక్కువ ఇష్టం. ఎవరి ఇష్టాలు వారివి, ఆమె అంటే నాకు ఎప్పుడూ గౌరవమే ఉంటుంది. నాకు ఇంత పేరు రావడానికి ఆమె కూడా ఓ కారణమని ఆది చెప్పుకొచ్చాడు.రాజకీయాలకు అతీతంగా ఆమెపై నాకు గౌరవం ఎప్పుడు ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం ఆది రోజాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+