నేనొక అడల్ట్‌.. అందుకే అడల్ట్‌ సినిమాలే చేస్తా అంటోన్నబాలీవుడ్ నిర్మాత..

బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ సోష‌ల్‌మీడియాలో నెటిజ‌న్లు అడిగిన ప్ర‌శ్న‌కు దిమ్మ‌దిరిగే స‌మాధానం ఇచ్చారు. థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఏక్తాక‌పూర్‌ను ఓ నెటిజ‌న్ దయచేసి మీరు అడల్ట్‌ సినిమాలు చేయడం మానండి అంటూ విజ్ఞప్తి చేశాడు. నేనొక అడల్ట్‌, కాబట్టి అడల్ట్‌ సినిమాలే చేస్తా అంటూ దిమ్మదిరిగే కౌంటర్‌ ఇచ్చారు ఏక్తాక‌పూర్.. ఏక్తాక‌పూర్ నిర్మించిన థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌ మూవీ ఈ మధ్యే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో భూమి భూమి ఫడ్నేకర్‌, బిగ్‌బాస్ న‌టి షెహనాజ్‌ గిల్‌, కుషా కపిలా ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాకి క‌ర‌ణ్ బులానీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏక్తాకపూర్‌, రియా కపూర్‌, అనిల్‌ కపూర్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా : ఈ సినిమాకి సెన్సార్‌ బోర్డ్‌ ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. ఈ సినిమా ఈ అక్టోబ‌ర్ 6న విడుదలై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఏక్తాకపూర్‌ తాజాగా ట్విటర్‌ వేదికగా 'Ask Me Anything' అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా నెటిజన్లు ఏక్తాకపూర్​ను దూషించారు. అయితే, ఆమె అదే స్థాయిలో నెటిజ‌న్ల‌కు కౌంటర్ ఇచ్చారు.

I am an adult.. thats why I do such films,says Bollywood producer Ekta Kapoor

నీ వల్ల ఎంతోమంది యువత చెడిపోతున్నారు. మంచి సినిమాలు చేయడం తెలుసుకో అంటూ కామెంట్ చేశారు. అయితే నెటిజన్ల కామెంట్ల‌కు తనదైన శైలిలో దిమ్మదిరిగిపోయే కౌంటర్లు ఇచ్చారు ఏక్తాక‌పూర్‌. నువ్వూ, ఆ కరణ్‌ జోహర్‌ కలిసి చాలామందిని చెడగొడుతున్నారు అని ప్రశ్నించారు. మరో నెటిజన్ ఎంతోమంది విడాకులకు మీ ఇద్దరే కారణం అంటూ దూషించాడు. దీనికి ఓ అవునా అంటూ ఏక్తాకపూర్ కామెంట్‌ చేశారు.

ఎన్నో సినిమాలు.. మ‌రెన్నో సీరియ‌ల్స్ : బాలాజీ టెలీఫిల్మ్స్​ను స్థాపించి హిందీ సీరియల్స్​కు క్రేజ్​ను తెచ్చిపెట్టారు నిర్మాత ఏక్తాకపూర్. జితేంద్ర, శోభా కపూర్‌ కుమార్తెగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె పలు సినిమాలు, సీరియల్స్‌ను నిర్మించడ‌మే కాకుండా ఎంతో మంది న‌టుల‌ను బుల్లితెర సూప‌ర్‌స్టార్‌గా తీర్చిదిద్దారు. రాగిణి ఎంఎంఎస్‌, డర్టీ పిక్చర్‌, షాదీ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌, ఏక్‌ విలన్‌, ఉడ్తా పంజాబ్‌, సూపర్‌ సింగ్‌, హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌, డ్రీమ్‌గర్ల్‌ వంటి చిత్రాలకు ఏక్తాక‌పూర్‌ నిర్మాతగా వ్యవహరించారు. వీటితో పాటు ఎన్నో సీరియ‌ల్స్‌ను నిర్మించారు. ఆమె నిర్మించిన ఎన్నో సీరియల్స్​ సూపర్ క్రేజ్ తీసుకొచ్చాయి.

కబీ బహు థీ సీరియల్​తో బుల్లితెరపై సంచలనం సృష్టించింది. ఏక్తా క‌పూర్ తీసిన క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' సీరియలో కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈ సీరియ‌ల్ సీరియల్ స్మృతి జీవితాన్ని మార్చేసింది. ఈ సీరియ‌ల్స్ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య సేహ్నం కుదిరంది. ప్రస్తుతం స్మృతి ఇరానీ న‌టన‌కు దూరమ‌య్యి రాజ‌కీయాల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఏక్తా కపూర్ ఎన్నో సీరియల్స్ నిర్మించి, ఎంతో మందికి స్టార్ డం వచ్చేలా అవకాశాలు ఇచ్చారు. ఆమె నిర్మించిన సీరియల్స్ ప్రేక్షకుల్లో మంచి ఆద‌ర‌ణను సంపాదించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+