నాగ చైతన్యను నా పక్కన హీరోగా ఊహించుకోలేను..స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

హీరో నాగ చైతన్య వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తాండేల్ సినిమాలో నటిస్తున్న చైతన్య..ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చాడు. విరూపాక్ష సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్‌గా మారిపోయిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమాకి చేయడానికి నాగ చైతన్య రెడీ అయ్యాడు. విరూపాక్ష మాదిరిగానే ఈ సినిమా కూడా హారర్ జోనర్‌లో తెరకెక్కబోతుంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్ , ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు సూపర్ స్టార్లుగా ఎదిగారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్య మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు.

I can t imagine Naga Chaitanya as a hero In fron of me heroine shocking comments

నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. కారణాలు తెలియదు కానీ నాగ చైతన్య కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.

ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్యను నా పక్కన హీరోగా ఊహించుకోలేనంటూ ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. పలు బాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా సారా అలీ ఖాన్ హీరో నాగ చైతన్యపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

నాగ చైతన్యతో సినిమా చేసే అవకాశం వచ్చిన కూడా రిజెక్ట్ చేశానని సారా అలీ ఖాన్ తెలిపింది. నాగచైతన్య ని బ్రదర్ లాగా ఫీల్ అవుతున్నాను కాబట్టి అతనితో నేను నటించలేను అంటూ డైరెక్టర్స్‌కి చెప్పిందంట. దీంతో ఆ సినిమాలో మరో హీరోయిన్‌ను తీసుకున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+