ఆ హీరోతో నటించి తప్పు చేశా - మీనాక్షి చౌదరి

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఏసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలామంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అవుతున్నారు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉండి కూడా ఏమాత్రం కెరీర్‌లో పెద్దగా హిట్లు లేని హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నిలిచారు. అయితే ఒకే ఒక సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది మీనాక్షి చౌదరి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ , మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గుంటూరు కారం' సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.

అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన కూడా ఈ సినిమా ఆమెకు ఫుల్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. దీంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. 'లక్కీ భాస్కర్', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది.

I made a mistake by making the film - Meenakshi Chaudhary

అయితే ఓ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. ఆ సినిమా చేసి తప్పు చేశానని చెప్పి షాకిచ్చింది ఈ అమ్మడు.ఆ సినిమా మరేదో కాదు తమిళ స్టార్ హీరో విజయ్‌తో నటించిన 'గోట్'.ఈ సినిమా ఫలితంపై మీనాక్షి చౌదరి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వద్ద 'గోట్' మూవీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ కెరీర్‌లోనే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.పైగా ఆ సమయంలో ఈ సినిమాపై దారుణమైన ట్రోల్స్ నడిచాయి.

మహేష్ బాబు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించి తప్పు చేసిన మీనాక్షి చౌదరి , ఇలా విజయ్ సినిమాలో సైతం ఇలాంటి పాత్రే పోషించి తప్పు చేసిందనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ తమిళ స్టార్ హీరో కూడా మీనాక్షి చౌదరికి హిట్ ఇవ్వలేకపోయారనే అభిప్రాయం వ్యక్తం అయింది. తాజాగా మీనాక్షి చౌదరి సైతం ఈ సినిమా చేసి తప్పు చేశానని చెప్పడం సంచలనంగా మారింది. ఇలా ఇద్దరి స్టార్ హీరోలతో నటించినా మీనాక్షి చౌదరికి హిట్ దక్కలేదు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి చిరంజీవి సినిమాలో నటిస్తోంది. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవకన్యలా కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+