నా భర్త 'గే' .. ముగ్గురిని కన్నాను.. ఇంకేం అడగొద్దు - ప్రముఖ కొరియోగ్రాఫర్
నా భర్తను చూసిన మొదటి రోజుల్లో అతను ఓ గే అని అనుకున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్. ఇలా కామెంట్స్ చేసింది మరెవరో కాదు..బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్. బాలీవుడ్‌లో ఫరా ఖాన్‌కు ఫుల్ పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. డ్యాన్స్ మాస్టర్‌గా షారుక్ ఖాన్ , సల్మాన్ ఖాన్, అమితాబ్ వంటి స్టార్ హీరోలందరితోనూ ఆమె పని చేశారు. అలాగే ఆమె దర్శకురాలిగా కూడా కొన్ని చిత్రాలకు పని చేశారు. ఫరా ఖాన్ దర్శకుడు అయిన శిరీష్ కుందర్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.
తాజాగా ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన భర్త గురించి ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేశారు. శిరీష్ కుందర్‌ను మొదటిసారి కలిసినప్పుడు అతను గే అని అనుకున్నానని చెప్పి ఆమె షాకిచ్చారు.మొదటి ఆరు నెలలు శిరీష్‌ను గే అని అనుకున్నానని, అతని ప్రవర్తన వల్ల అలా అనుకున్నానని ఆమె చెప్పారు. అయితే, తర్వాత అతని గురించి తెలుసుకున్న తర్వాత తన అభిప్రాయం మారిందని ఆమె తెలిపారు. పెళ్లైన మొదటి సంవత్సరంలోనే పారిపోవాలని అనుకున్నానని కూడా వెల్లడించింది, ఎందుకంటే సర్దుకుపోవడం చాలా కష్టంగా ఉండేదట.అయితే, కాలక్రమేణా వారి బంధం బలపడిందని ఆమె తెలిపారు.

ఫరా ఖాన్ తన భర్తను "ఫాదర్ ఆఫ్ ది ఇయర్" అని తరచుగా ప్రశంసిస్తూ ఉంటారు.ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించి 2004లో వారు వివాహం చేసుకున్నారు. శిరీష్ కుందర్ ఫిల్మ్ ఎడిటర్ ,దర్శకుడు. వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు పనిచేశారు - 'మై హూ నా' (2004) చిత్రానికి శిరీష్ ఎడిటర్‌గా వ్యవహరించగా, ఆ తర్వాత 'జాన్-ఎ-మన్' (2006), 'ఓం శాంతి ఓం' (2007), 'తీస్ మార్ ఖాన్' (2010) వంటి చిత్రాల్లో కలిసి పనిచేశారు.ఫరా ఖాన్ ,శిరీష్ కుందర్‌లకు 2008లో ఐవీఎఫ్ ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. వీరికి ఒక కుమారుడు , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.












Click it and Unblock the Notifications