అతనితో ముగ్గురు పిల్లల్ని కంటా - జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్‌ను స్టార్ హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు. కానీ ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించడం జరిగింది.

జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది. ఇదే సమయంలో జాన్వీ కపూర్‌కు తెలుగులో వరుస అవకాశలు వస్తున్నాయి. ఎన్టీఆర్ 'దేవర'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైన జాన్వీ కపూర్ , తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 'దేవర-2'తో పాటు, రామ్ చరణ్ కొత్త సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.

I will get married and settle in Tirupati - Janhvi Kapoor

తన హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. చీర కట్టిన, స్కార్ట్ వేసిన ఎందులో అయిన సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌‌ను అధికంగా కేటాయిస్తూ జాన్వీకపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్‌లో ఓ భాగమనే చెప్పాలి.

పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా జాన్వీకపూర్ పెళ్లిపై కీలక కామెంట్స్ చేసింది. తాను పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలతో తిరుపతిలో సెటిల్ కావాలని అనుకుంటానని చెప్పి తన మనస్సులోని మాటను బయటపెట్టింది. ప్రతిరోజు అరటి ఆకులో భోజనం చేస్తూ, గోవిందా గోవిందా అని జపించాలని ఉందని జాన్వీకపూర్ చెప్పుకొచ్చింది. నా భర్త లుంగి కట్టుకుని ఉంటే ఆయనకు మసాజ్ చేయాలని, అది నాకు చాలా రొమాంటిక్‌గా ఉంటుందని, అలాగే ప్రతిరోజు జడలో మల్లెపూలు పెట్టుకుని మణిరత్నం సినిమాల్లోని పాటలు వింటూ కూర్చోవాలని ఉందని ఈ హాట్ బ్యూటీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీకపూర్ పెళ్లి, పిల్లలపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+