వైసీపీ పద్మవ్యూహంలో చిక్కుకున్న అల్లు అర్జున్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకు తెలియకుండానే ఏపీలో రాజకీయ వివాదానికి ఆద్యుడయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ స్నేహితుడు. ఆయనకు మద్దతు తెలిపేందుకు సతీ సమేతంగా నంద్యాల వచ్చారు. బన్నీ నంద్యాల శివారు ప్రాంతానికి చేరుకోగానే భారీ వాహనాలు, మోటార్ సైకిళ్లతో స్వాగతం పలికారు. పట్టణంలోకి ఆయన్ను ఊరేగింపుగా తీసుకువచ్చారు.

ముందస్తు ప్రణాళిక
వాస్తవానికి బన్నీ పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తుగా అనుమతివ్వలేదు. అనుమతులు లేకపోయినా పోలీసులు కూడా విస్త్రతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. తక్కువ సమయంలోనే వందలమంది గుమికూడటంతో ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఇది వివాదాస్పదంగా మారింది.
అయితే అల్లు అర్జున్ పర్యటనను వైసిపి ఉద్దేశపూర్వకంగానే వివాదం చేసినట్లు తెలుస్తోంది. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. కానీ వైసీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా అల్లు అర్జున్ వచ్చేసరికి.. పట్టణ శివారు నుంచి భారీ వాహనాలు, మోటార్ సైకిల్ తో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనను తీసుకు వచ్చాయి.

ఇచ్చిన మాట కోసం
బన్నీ పర్యటనకు అధికారిక అనుమతులు లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా ఫ్రీ ప్లాన్ గా చేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం, దీనిపై ప్రచారం జరగడంతోపాటు అల్లు అర్జున్ తమ వాడిగా వైసీపీ చెప్పడంతోపాటు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసింది. చివరకు దీనిపై బన్నీ స్పష్టతనిచ్చారు.
కిషోర్ రెడ్డి తనకు 15 సంవత్సరాల నుంచి స్నేహితుడని, రాజకీయాల్లోకి వస్తే తాను కచ్చితంగా మద్దతిస్తానని మాటిచ్చానని, 2019 ఎన్నికల్లో కలవలేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తానే ఫోన్ చేసి నంద్యాల వస్తానని అడిగానని, అందుకే తన భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాల వచ్చానని బన్నీ చెప్పారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications