ఒక్కరోజుకు అల్లు అర్జున్ ఎంత తీసుకుంటాడో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ పని చేసినా ఆ పనిలో తన మార్క్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. సినిమా సినిమాకు బన్నీ రేంజ్ పెరుగుతోంది. అలాగే వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు ఒక్కరోజుకు 6 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసినవారు అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూ ఈ రేంజ్ లో పెరిగిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఒక్కరోజు కోసం దాదాపు రూ.6 కోట్లు తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. మూడు సంవత్సరాలక్రితం బన్నీ తీసుకున్న రెమ్యునరేషన్ తో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. ఇతర భాషల్లో కూడా భారీగా గుర్తింపు ఉండటంతో బన్నీ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

బన్నీ ప్రస్తుతం పుష్ప2 చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన ఇది విడుదల కాబోతోంది. ఈ సినిమాకు అల్లు అర్జున్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయనున్నారు. పుష్ప2 షూటింగ్ పూర్తవగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా భారీస్థాయిలో తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీ కూతురు అల్లు అర్హ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అర్హకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది.
పుష్ప సినిమాకు అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఏ కథానాయకుడిగా ఉత్తమ నటుడి అవార్డు లభించలేదు. మొదటిసారి దీన్ని తెలుగు పరిశ్రమకు బన్నీ సాధించి పెట్టాడు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పుష్ప2పై దర్శకుడు సుకుమార్ తో కలిసి స్క్రిప్ట్ పై మరింత కసరత్తులు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్.












Click it and Unblock the Notifications