అల్లు అర్జున్‌తో 'లవ్‌స్టోరీ'ని బయటపెట్టిన మెగా డాటర్
మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు దక్కలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది.
అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. విడాకులు అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తోంది. మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో 'మద్రాస్‌కారన్' మూవీలో హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. తెలుగులో మనోజ్ నటిస్తోన్న ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ''కమిటీ కుర్రాళ్లు'' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

తాజాగా ఈ భామ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్ హీరోలతో సినిమాలు తీయడమే తన కల అని నిహారిక ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. మహేష్ బాబుతో మైథాలజికల్ సినిమాని , ప్రభాస్‌తో కామెడీ సినిమా తీయాలని కోరికగా ఉందని తెలియజేసింది. ఒకవేళ తనకు డైరెక్షన్లో అవకాశం వస్తే మొదటి సినిమాని రామ్ చరణ్ తో తీస్తానంటూ తెలియజేసింది. అయితే మొదట అల్లు అర్జున్‌తో ప్రేమ కథ చిత్రాన్ని తీయాలని ఉందని తన మనస్సులో మాటను బయటపెట్టింది. ఒకవేళ దర్శకత్వం వహిస్తే మాత్రం తన అన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేస్తానని మెగా డాటర్ చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications