బాలయ్య కాకుండా మరొకరైతే ఆ డైరెక్టర్ ఇండస్ట్రీలోనే ఉండేవాడు కాదు!

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాడు. హనుమాన్ సినిమా ఊహించనిరీతిలో ఘనవిజయాన్ని సాధించడంతో ఎవరిమాటను ఇతను వినే పరిస్థితిలో కనపడటంలేదంటున్నారు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞను పరిచయం చేసే బృహత్తరమైన బాధ్యతను అప్పగించినప్పటికీ చివరి నిముషంలో ప్రభాస్ సినిమా చేస్తాను అని హామీ ఇవ్వడంతో కప్పగంతులు వేశాడు. దీంతో మోక్షజ్ఞ సినిమా ఆగిపోయింది. నేను చేయను.. నా అసిస్టెంట్ ను పెట్టి చేపిస్తాను అని ప్రశాంత్ వర్మ చెప్పడంతో బాలయ్య గట్టిగా లాగిపెట్టి రెండిచ్చాడని తెలుస్తోంది. అయినప్పటికీ ఆ దర్శకుడి బుద్ధి మాత్రం ఇంతవరకు మారలేదంటున్నారు.

ప్రభాస్ చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి
హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జైహనుమాన్ చేస్తున్నాడు. దీనితర్వాత ప్రభాస్ తో సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి2, సలార్2 సినిమాలు వరుసగా చేస్తున్నాడు. దీంతో చాలా బిజీగా ఉండటంతో ప్రశాంత్ వర్మతో సినిమా చేయడం కష్టమవుతోంది. దీంతో స్టార్ హీరోల చుట్టూ తిరుగుతూ కథలు చెబుతున్నాడు. కథలు బాగున్నప్పటికీ ఏ ఒక్క స్టార్ హీరో కూడా అతనితో సినిమా చేయడానికి ముందుకు రావడంలేదు. దీనికి అతని ప్రవర్తనే కారణం. సినిమాలు తీయకుండా కేవలం హీరోల చుట్టూ తిరుగుతూ కథలు చెప్పడంవల్ల ఉపయోగమేంటని వారంతా ప్రశ్నిస్తున్నారు. హనుమాన్ తర్వాత మరో సినిమా తీసి చూపించు.. అప్పుడు అవకాశాలిస్తాం అని తేల్చిచెబుతున్నారు.

If it was anyone other than Balayya that director wouldn t have been in the industry

బాలయ్య కాకుండా మరొకరైతే అతను పరిశ్రమలోనే ఉండేవాడు కాదు
దీంతో స్టార్ డైరెక్టర్ గా, నెంబర్ వన్ డైరెక్టర్ గా అవుదామని కంటున్న అతని కలల తీరడంలేదు. ఈ సమయానికి బాలయ్య కొడుకు సినిమా సగం పూర్తయ్యేది. దాన్ని సూపర్ హిట్ చేసివుంటే ఇతర హీరోలకు బాలయ్యే రికమెండ్ చేసేవాడు. ఆ అవకాశాన్ని కాలదన్నుకొని ఒక్క సినిమాను కూడా సరిగా పూర్తిచేయకుండా కథలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి ఆలోచనలతోనే ఉంటే జీవితంలో నెంబర్ వన్ డైరెక్టర్ కాదుకదా.. అసలు డైరెక్టరే అవడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నాడు. బాలయ్య మంచోడు కాబట్టి వదిలేశాడని, ఇంకొకరైతే పరిశ్రమలోనే లేకుండా చేసేవారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+