కల్కి టిక్కెట్లు బుక్ చేస్తే.. పాత కల్కి మూవీ టిక్కెట్లు బుక్ అవుతున్నాయ్.. బుక్ మై షో క్లారిటీ..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఈ నెల 27 న థియేటర్లలోకి రానుంది. అయితే, ఇప్పటికే సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. ఈ చిత్రానికి ఉన్నక్రేజ్‌తో బుకింగ్స్ ప్రారంభం అయిన కొన్ని నిమిషాలకే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. అయితే, ఈ టిక్కెట్స్ బుకింగ్ సమయంలో చాలా సమస్యలు తలెత్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే..!
గతంలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్, హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో 'కల్కి' అనే సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సింది పోయి చాలామంది పొరపాటున రాజశేఖర్ కల్కి మూవీ బుక్ చేసుకున్నారు. దీంతో చాలామంది సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై తాజాగా బుక్‌మై షో స్పందించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ సమస్యలు వస్తున్నారు. దీనిపై ఎవరు అందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. రాజశేఖర్ 'కల్కి'టికెట్లనే 'కల్కి 2898 ఏడీ' టికెట్లుగా భావిస్తాం.. ఆ టికెట్ చూపించే ప్రభాస్ కల్కి సినిమా చూడవచ్చు అంటూ బుక్ మై షో క్లారిటీ ఇచ్చేసింది. దాంతో ప్రభాస్ అభిమానులు కాస్త ఊపిరీ పీల్చుకున్నారు.

స్పందించిన యాంగ్రీ స్టార్..
ఇక, ఈ విషయంపై యాంగ్రీ స్టార్ రాజశేఖర్ స్పందించారు. ప్రభాస్ కల్కిసినిమా కాకుండా రాజశేఖర్ 'కల్కి' టికెట్లను ప్రజలు బుక్ చేసుకున్నారని, భ్రమరాంబ థియేటర్లలో ఏకంగా ఆరు షోలు ఫుల్ అయ్యాయని తాజాగా నెట్టింట్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం నటుడు రాజశేఖర్ స్పందించారు. "నాకు ఈ విషయంపై ఎలాంటి సంబంధం లేదు. జోక్స్ పక్కన పెడితే..ప్రభాస్ కల్కి చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 2019లో 'కల్కి' సినిమా విడుదలయ్యింది. ఇందులో రాజశేఖర్ హీరోగా నటించాడు. ఈ చిత్రం అప్లట్లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది.












Click it and Unblock the Notifications