మహేష్‌బాబు వద్దంటే రామ్‌చరణ్ చేసి సూపర్‌హిట్ కొట్టాడు

పరిశ్రమలో ఒకరి కోసం రాసుకున్న కథలు మరొకరి దగ్గరకు చేరడం సహజంగా జరుగుతుండే విషయమే. దర్శకులు తాము కథ రాసుకునేటప్పుడే ఒక హీరోను అనుకొని, ఆ హీరో బాడీలాంగ్వేజ్ కు అనుగుణంగా కథను, డైలాగులను, స్క్రీన్ ప్లేను సిద్ధం చేసుకుంటారు. అయితే వేరే సినిమాలు చేస్తుండటం, కాల్షీట్లు ఖాళీ లేకపోవడం, కథ నచ్చకపోవడం.. ఇతరత్రా కారణాలతో దర్శకులు చెప్పిన కథలను హీరోలు తిరస్కరిస్తుంటారు. అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లి రాసుకున్న కథను ముందుగా మహేష్ బాబుకు చెప్పగా ఖాళీ లేకపోవడంతో నో చెప్పాడు. దీంతో అదే కథను రామ్ చరణ్ కు వినిపించగా అతను చేసి సూపర్ హిట్ కొట్టాడు.

ఎంతోమంది హీరోలు స్టార్లుగా మారారు
రామ్ చరణ్ కథానాయకుడిగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఎవడు సినిమా ముందుగా మహేష్ బాబు వద్దకే చేరింది. అయితే ప్రిన్స్ కు ఖాళీలేక దాన్ని వదులుకున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అతిథి పాత్రలు పోషించారు. వంశీ పైడిపల్లి తర్వాత మహేష్ బాబుతో మహర్షి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. చాలామంది హీరోలు ఇప్పుడు స్టార్లుగా వెలుగొందడానికి కారణమైన అనేక బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ సినిమాలు చాలావాటిని మహేష్ బాబు వద్దనుకున్నారు. అవి చేసిన తర్వాతే చాలామంది స్టార్లుగా మారారు. ఇటీవలే వచ్చిన పుష్ప సినిమా కూడా ముందుగా మహేష్ బాబు వద్దకే చేరింది. ఆయన వద్దనడంతో అల్లు అర్జున్ చేశాడు.

If Mahesh Babu didn t have it Ram Charan did it and it became a superhit

హాలీవుడ్ హీరో కాబోతున్న మహేష్ బాబు
యానిమల్, ఫిదా, వర్షం, ఇడియట్, ఏమాయ చేశావే, గజిని.. ఇలా చాలా సినిమాలను వదులుకున్నారు. కానీ అదే సమయంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమాలను కూడా అభిమానులకు అందించాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం ఇటలీ వెళ్లాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఒడిసాలో పూర్తిచేసుకుంది. తర్వాత అంత విదేశాల్లో చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది చివరికి లేదంటే తర్వా ఏడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకచోప్రా పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనే విషయం బయటకు రావాల్సి ఉంది. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా విడుదల కాబోతోంది. దీంతో అంతర్జాతీయస్థాయిలో హాలీవుడ్ హీరోగా మహేష్ బాబు అవతరించబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+