ఆమె సినిమా ఒప్పుకుంటే కనీసం రూ.500 కోట్లు ఖాయం.. హీరోలకు సెంటిమెంట్!

ఆ హీరోయిన్ సినిమా ఒప్పుకుంటే కనీసం రూ.500 కోట్లు ప్రారంభ వసూల్లు దక్కుతాయి. అంతేకాదు.. క్రమేణా ఆ సినిమా రూ.వెయ్యి, రూ.1500 కోట్లు, రూ.1900 కోట్లు.. ఇలా సాధిస్తుంది. ఆమె సినిమా చేసిందంటే కచ్చితంగా హిట్ అవడం ఖాయం. బ్లాక్ బస్టర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రెండు సినిమాలు చేస్తే అందులో ఒక సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లో ఉన్న హీరోలకు ఆమె సెంటిమెంట్ గా మారిపోయింది. ఆమె కాల్‌షీట్ల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ కూడా ఆమె ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.

వరుసగా అన్ని సినిమాలు రూ.వందల కోట్లే
తాజాగా విడుదలైన చావాలో శంభాజీ మహారాజ్ భార్య యశోబాయిగా నటించింది. ఈ సినిమా రూ.500 కోట్లు దాటింది.. అదీ ఒక్క హిందీలోనే. త్వరలోనే అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీనికి ముందు పుష్ప2 సినిమా ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. రూ.1850 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ముందు సందీప్ దర్శకత్వంలో యానిమల్ చేసింది. ఈ సినిమా రూ.950 కోట్లు వసూలు చేసింది. దానికి ముందు తెలుగులో సీతారామం లాంటి క్లాసికల్ ఉంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమా చేస్తోంది. మురుగదాస్ దర్శకుడు. ఈ సినిమా ఎన్నికోట్ల రూపాయలు వసూలు చేస్తుందో చూడాలి.

If Rashmika agrees to do the film she will get at least Rs 500 crores

అందరికీ రష్మిక అంటే సెంటిమెంట్ అయిపోయింది
రష్మికను హీరోయిన్ గా తీసుకుంటే చాలు సినిమా హిట్ అనే సెంటిమెంట్ హీరోలకు పడిపోయింది. హీరోయిన్లను రెండోసారి తీసుకోని సుకుమార్ కూడా పుష్ప1, పుష్ప2 తర్వాత రామ్ చరణ్ సినిమాలో కూడా రష్మికనే తీసుకోబోతున్నట్లు సమాచారం. అలాగే పుష్ప3లో ఉంటుంది. ఇలా అందరికీ సెంటిమెంట్ అయిపోయిన రష్మిక మందన్నా కన్నడ సీమ నుంచి చలో సినిమాద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం నేషనల్ క్రష్ అనే బిరుదును సంపాదించకుంది. భవిష్యత్తులో మరెన్ని బ్లాక్ బస్టర్లు సాధిస్తుందో చూడాలి. మరోవైపు ఆమె ప్రేమికుడు విజయ్ దేవరకొండ మాత్రం హిట్ కోసం ఆపసోపాలు పడుతున్నాడు. కింగ్ డమ్ తో బ్లాక్ బస్టర్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+