తమన్నా అలా కనిపిస్తే చాలు..దర్శకుడు వివాదాస్పద కామెంట్స్
తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి , తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది.
తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికి తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే తమన్నా గురించి ఓ దర్శకుడు వివాదాస్పద కామెంట్స్ చేశాడు. భారతీయుడు 2 రిలీజైన రోజే టీన్జ్ అనే మూవీ విడుదలైంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. భారతీయుడు 2 ఫ్లాప్ కావడంతో , తమిళ సినీ అభిమానులు టీన్జ్ సినిమాను చూడటానికి మొగ్గు చూపిస్తున్నారు.
ఈ సినిమాకు పార్తీబన్ దర్శకత్వం వహించారు. తాజాగా పార్తీబన్ ఇంటర్వ్యూలో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో తమిళం సరిగా రాయకపోయినా పర్వాలేదు కానీ.. సినిమా హిట్ కావాలంటే తమన్నా డ్యాన్స్ సరిపోతుందని, కథ అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేసినట్లు తమిళ మీడియా పేర్కొంటోంది. తమన్నా డ్యాన్స్ చేస్తే చాలు సినిమా హిట్ అవుతుందని వ్యాఖ్యానించారు. ఇటీవల తమన్నా.. రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి విదితమే. జైలర్ మూవీలో 'నువ్వు కావాలయ్యా', బాక్ సినిమాలో 'అయ్యో అయ్యో' సాంగ్స్‌లో తమన్నా నటించింది. ఈ రెండు కూడా పెప్ సాంగ్స్ కావడంతో.. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించడంతోనే పార్తీబన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.












Click it and Unblock the Notifications