ఈ హీరో 18 సినిమాలు చేస్తే.. 16 డిజాస్టర్‌లే..!

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు,అదృష్టం కూడా కలిసి రావాలి. టాలెంట్ ఉండి అదృ‌ష్ట లేక చాలామంది హీరో, హీరోయిన్లు ఫెడ్ అవుట్ అయిపోయారు, అవుతున్నారు కూడా. ఫ్యామిలీ బాగ్రౌండ్ అనేది ఒకటి,రెండు సినిమాలకు మాత్రమే ఉపయోగపడుతుందని కొందర్ని చూస్తే అర్థం అవుతోంది. అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు శిరీష్ ఈపాటికే స్టార్ హీరోగా మారాలి. ఇక రానా సైతం స్టార్ హీరోగా గుర్తింపు పొందాలి. కానీ వీరిద్దరు కూడా సాధారణ నటులుగానే మిగిలిపోయారు. దీంతో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ పెద్దగా ఉపయోగపడదని వీరిని చూస్తే అర్థం అవుతోంది.

ఈ విషయంలో హీరో సుధీర్ బాబు పేరును కూడా ప్రస్తావించాలి. పుష్కరకాలం కింద హీరోగా పరిచియమయ్యాడు సుధీర్ బాబు. ఫుల్ టాలెంట్ ఉన్నప్పటికీ సుధీర్ బాబుకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ ఇచ్చే సినిమా రాలేదనే చెప్పాలి. తెలుగులో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. నిజానికి సుధీర్ బాబు, ఒక సినిమాకు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో దానికి మంచి పెడుతుంటాడు. చెప్పాలంటే గొడ్డులా పని చేస్తుంటాడు. కానీ ఆయన కష్టానికి తగిన ఫలితం మాత్రం రావడం లేదు. నిజానికి సుధీర్ బాబు కేవలం తన కష్టం మీదే పైకొచ్చాడు.

If this hero does 18 movies 16 are disasters

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడుగా, మహేష్ బాబుకు బావగా సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ , తాను సొంతంగానే ఎదగాలనే భావించారు. కృష్ణ , మహేష్ బాబు పేర్లను వాడుకుని సినిమాల్లో అవకాశాలు పొందాలని సుధీర్ బాబు ప్రయత్నించలేదు. ఏమాయ చేశావే సినిమాలో సమంత అన్నగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. ఎస్‌ఎంస్ (శివ మనసులో శృతి) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. 'ప్రేమ కథా చిత్రమ్‌' సినిమా సుధీర్ బాబుకు మంచి బ్రేక్ ఇచ్చింది. భలే మంచి రోజు, శమంతకమణి, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే ఇలా మంచి మంచి సినిమాలు చేసినప్పటికీ ఇవి ఏమీ కూడా సుధీర్ బాబుకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి.

సుధీర్ బాబు బాలీవుడ్‌లో విలన్‌గా కూడా ట్రై చేశాడు. ఇక ఈ ఏడాది రిలీజైన హరోంహర సినిమాకు సైతం పాజిటీవ్ టాక్ వచ్చింది. కానీ.. కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. ఇప్పటివరకు సుధీర్ బాబు 18 సినిమాల్లో నటిస్తే.. అందులో 16 డిజాస్టర్ సినిమాలే. కేవలం 2 మాత్రమే హిట్లు. అందులో సమ్మోహనం కూడా కమర్షియల్‌గా యావరేజ్ హిట్టు. ఒక్క ప్రేమ కథా చిత్రం మాత్రమే బ్లాక్ బస్టర్ అయింది. ఇక మిగిలిన సినిమాలన్నీ కూడా సుధీర్ బాబుకు నిరాశనే మిగిల్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+