"ఒక హత్య , 11 మంది అనుమానితులు" .. ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్
ఇటీవల కాలంలో ఓటీటీలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు , చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కంటెంట్ బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు పరభాష సినిమాలను సైతం నెత్తిన పెట్టుకుంటారనే విషయం తెలిసిందే. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం ఇతర భాషల్లో హిట్ సినిమాలను తెలుగు భాషలో డబ్ చేస్తూ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
దీనిలో భాగంగానే తాజాగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ అదరగొడుతుంది. ఆ సినిమానే "ప్రవీణ్ కూడు షాప్పు".ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో బాసిల్ జోసఫ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. సినిమా కథ విషయానికి వస్తే...ఒక కల్లు దుకాణంలో జరిగిన హత్య చుట్టూ తిరుగుతుంది. వర్షం కారణంగా దుకాణం మూసివేసిన తర్వాత, 11 మంది లోపలే ఉండి, రాత్రంతా మద్యం తాగుతూ పేకాట ఆడుకుంటారు.

ఉదయం, దుకాణం యజమాని కొంబన్ బాబు ఉరి వేసుకుని చనిపోయి ఉంటాడు. ఒక పోలీసు అధికారి ఆ రాత్రి అక్కడ ఉన్న 11 మందిని విచారించి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ దర్యాప్తులో దాగి ఉన్న రహస్యాలు బయటపడతాయి, కొంబన్ బాబును ఎవరు చంపారు, అతని శరీరాన్ని దుకాణంలో ఎందుకు వేలాడదీశారు అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి వస్తుంది.పోలీసులు ఈ హత్యని ఎలా ఛేదిస్తారు అనేది కథాంశం.ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో, హాస్య సన్నివేశాలతో కూడుకుని ఉంటుంది.
ఈ సినిమా జనవరి 16, 2025న థియేటర్లలో విడుదలైంది. మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, నటీనటుల ప్రదర్శన, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ మరియు నేపథ్య సంగీతం ప్రశంసలు పొందాయి. అయితే, కథనంపై విమర్శలు వచ్చాయి. థియేటర్లలో పెద్దగా విజయం సాధించలేకపోయిన ఈ చిత్రం ఏప్రిల్ 11, 2025 నుండి SonyLIVలో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సినిమాకు శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, బేసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించారు.












Click it and Unblock the Notifications