ప్రిన్స్ మహేష్‌బాబుతో జతకట్టనున్న ఇండోనేషియా నటి...
సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇండోనేషియా నటి జతకట్టనున్నట్ల వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దర్శకధీరుడు రాజామౌళి, మహేష్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ఇండోనేషియా బ్యూటీని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం. రైటర్ విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఈ సినిమా ఆ కోసం కథను కూడా సిద్ధం చేసేశారట. ఈ చిత్రంలో హాలీవుడ్ నటి మహేష్‌కు జోడిగా నటిస్తున్నారని కూడా టీ టౌన్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆమె ఎవరో కాదు. ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్.
మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ స్థాయిలో రూపోందబోతుంది. అయితే, ఈ వార్తపై అధికారికంగ ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, దర్శకుడు రాజమౌళి ఇన్‌స్టాగ్రామ్‌ను చెల్సియా ఇస్లాన్ ఫాలో అవుతుంది. దాంతో మహేష్ సినిమాలో ఈ హాలీవుడ్ భామ నటిస్తుందని మహేష్ అభిమానులు అనుకుంటున్నారు. అయితే, ఈ విషయంపై ఇటు మహేష్ కానీ, చిత్ర యూనిట్ కానీ స్పందించలేదు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో నటించనుందంటూ సోషల్‌మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. ఇండోనేషియా బ్యూటీ చెల్సియా జకార్తాలో తన స్టడీస్ పూర్తిచేసింది. 2013లో హాలీవుడ్ ఫిల్మ్ రిఫ్రైన్ తో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'స్ట్రీట్ సొసైటీ', 'హెడ్‌షాట్', 'మే ది డెవిల్ టేక్ యు' వంటి సినిమాలతో మంచి నటిగా పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ ఇండోనేషియా బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది.

కొత్తలుక్‌లో కనిపించబోతున్న ప్రిన్స్..:
మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఆఫ్రికేన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటున్నట్లు సమాచారం. ఇక, ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం ఈ చిత్రంలో మరో కొత్తలుక్‌లో అభిమానులను అలరించనున్నారు. ఇప్పటికే మహేష్ బాబు లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం స్ర్కీప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.












Click it and Unblock the Notifications