వార్నీ.. ఇంత ఖాళీగా ఉన్నారేంట్రా: ఛావా చూసి మొఘలుల నిధి కోసం అన్వేషణ

Chhava: బాలీవుడ్‌లో సంచలనం రేపుతోన్న హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్.. ఛావా. కిందటి నెల 14వ తేదీన విడుదలైంది. విక్కీ కౌశల్ హీరో. ఆయన సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.

స్టార్ ప్యాక్డ్..

లీడ్ క్యారెక్టర్‌లో నటించాడు విక్కీ కౌశల్. మహారాణి యశోబాయి పాత్రలో మెరిశారు రష్మిక మందన్న. ఔరంగజేబ్ పాత్రను అక్షయ్ ఖన్నా పోషించాడు. అశుతోష్ రాణా, దివ్య దత్త, వినీత్ కుమార్ సింగ్, డయానా పెంటీ, సంతోష్ జువేకర్, నీల్ భూపాళం, ప్రదప్ రావత్.. వంటి భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్.

Inspired by the Chhaava locals began a treasure hunt Asirgarh Fort in Burhanpur

రూ.500 కోట్ల క్లబ్‌

150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రఖ్యాత ప్రొడక్షన్ హౌస్ మడ్డోక్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ పుష్ప2 తరువాత రష్మిక నటించిన మూవీ కావడం వల్ల హైప్ క్రియేట్ అయింది. శుక్రవారం నాటికి 483.40 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టుకుంది. ఈ వీకెండ్ ముగిసేనాటికి 500 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం దాదాపుగా ఖాయమైనట్టే.

భారీగా తవ్వకాలకు..

ఈ సినిమాలో ప్రదర్శించిన ఓ సన్నివేశం- మధ్యప్రదేశ్‌ బుర్హాన్‌పూర్‌ అసీర్‌గఢ్ ఫోర్ట్‌లో భారీగా తవ్వకాలకు దారి తీసింది. నిధి అన్వేషణ కోసం గ్రామస్తులను ప్రేరేపించింది. పదుల సంఖ్యలో స్థానికులు, ఇరుగు పొరుగు గ్రామస్తులు పలుగు, పార, జల్లెడ పట్టుకుని ఆ కోటకు పరుగులు తీయడానికి కారణమైంది.

అసీర్‌గఢ్ కోటలో..

ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను ఓడించిన తరువాత మరాఠా రాజుల వద్ద ఉన్న లెక్కలేనంత బంగారాన్ని అప్పటి మొఘల్ కింగ్ ఔరంగజేబ్ దోచుకున్నాడని, దాన్ని బుర్హాన్‌పూర్‌లో గల అసీర్‌గఢ్ కోటలో దాచి పెట్టాడనేది ఆ సన్నివేశం సారాంశం. లెక్కలేనంత బంగారం ఇప్పటికీ అక్కడ ఉందని నమ్ముతుంటారు స్థానికులు.

నిద్రాహారాలు మాని నిధి అన్వేషణలో..

తమ నమ్మకాన్ని ఈ ఛావా సినిమా సైతం బలపర్చడంతో వాళ్లు ఆగలేకపోయారు. రెండు రోజులుగా అసీర్‌గఢ్ కోటలో తవ్వకాలు సాగిస్తోన్నారు. ఎక్కడి పడితే అక్కడ తవ్వేస్తోన్నారు. నిద్రాహారాలు మాని నిధి అన్వేషణలో నిమగ్నం అయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అర్ధరాత్రి పూట సైతం..

అర్ధరాత్రి పూట సైతం నిధుల అన్వేషణకు బ్రేకులు పడట్లేదు. హెడ్ లైట్ ఉన్న హెల్మెట్లను ధరించి మరీ తమ అన్వేషణ కొనసాగిస్తోన్నారు. ఈ క్రమంలో పోలీసులు, పురావస్తు విభాగం అధికారుల ఆంక్షలను సైతం లెక్క చేయట్లేదంటే వాళ్ల నమ్మకం ఏ స్థాయిలో నాటుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+