ప్రభాస్ ఇంట్లో వంద ఏళ్ల నాటి చెట్టు.. ఎన్ని కోట్లు.. స్పెషాలిటీ ఏంటంటే !
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమాలకు సంబంధించి కాకుండా పర్సనల్ మ్యాటర్ లో హాట్ టాపిక్ గా మారారు. ప్రభాస్ రీసెంట్ గానే కొత్త ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఓ విలువైన విషయం గురించి సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
100 ఏళ్ల కల్ప వృక్షం..
హిందూ పురాణాలలో కల్పవృక్షంకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ చెట్టు భక్తుల కోరికలు తీర్చేదిగా.. శాంతి, సంతానం, సంపద లాంటి వంటిని అందిస్తుందని నమ్ముతుంటారు. ఈ చెట్టును కొందరు గృహప్రవేశం సమయంలో.. పూజ స్థలాల్లో లేదా ప్రత్యేకంగా ఇంటి పెరట్లో ఏర్పాటు చేస్తారు.

అంతే కాకుండా ఈ చెట్టు వయస్సును బట్టి విలువ నిర్ణయిస్తారట. ప్రభాస్ కొనుగోలు చేసిన కల్పవృక్షం వయసు దాదాపు 100 ఏళ్లు అని.. అందుకే దాని ధర ఏకంగా కోటి రూపాయలు దాటిందని అంటున్నారు. ప్రభాస్ హైదరాబాద్‌లో నిర్మిస్తున్న విలాసవంతమైన కొత్త ఇంటిలో ఈ చెట్టును ప్రత్యేకంగా దిగించి నాటించారని చెబుతున్నారు. ముఖేష్ అంబానీ ఇంట్లో కూడా ఈ చెట్టు ఉందని సమాచారం.
మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక సందీప్ రెడ్డితో 'స్పిరిట్' చిత్రం చేయనున్నారు. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత నాగ్ అశ్విన్ తో కల్కి - 2 , ప్రశాంత్ నీల్‌తో సలార్ 2.. అలానే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేయాల్సి ఉంది.
ప్రస్తుతం రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో.. బ్యాలెన్స్ షూట్ కూడా కంప్లీట్ చేయాలనే బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరో పక్క తన డేట్స్ ని హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ సినిమాకి కూడా కేటాయిస్తున్నారు.












Click it and Unblock the Notifications