కోటా శ్రీనివాసరావు చివరి మూవీ ఎవరితో అంటే ?
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మరణం తీవ్ర విషాదం నింపింది. తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించిన కోట.. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఈరోజు ( జూలై 14, 2025 ) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. అలానే సోషల్ మీడియా వేదికగా కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
బ్యాంకు ఉద్యోగిగా..
సినిమాల్లోకి రాకముందు బ్యాంకు ఉద్యోగిగా పని చేసిన కోట శ్రీనివాసరావు.. నటనపై మక్కువతో వందలాది నాటకాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనే ఆసక్తితో మాగంటి మురళీ మోహన్ సలహాను అనుసరించి, దర్శకుడు క్రాంతికుమార్ పరిచయంతో 1978లో వచ్చిన 'ప్రాణం ఖరీదు' ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఇదే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కూడా పరిచయం అయినా విషయం తెలిసిందే.

కోట శ్రీనివాసరావుకు సినీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అంటే.. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించిన 'ప్రతిఘటన' అనే చెప్పాలి. ఆ తర్వాత జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన 'అహా! నా పెళ్లంట' స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన చూపిన హాస్యం, హావభావాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నాటి నుంచి విలన్ గా, కమెడీయన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో 750 కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు.
మెగా ఫ్యామిలీతో అనుబంధం..
కోట శ్రీనివాసరావు మెగా ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం ఉందని అనిపిస్తుంది. రాజకీయాల పరంగా పక్కన పెడితే.. సినిమాల విషయంలో చిరంజీవితో పాటే 'ప్రాణం ఖరీదు' తో కెరీర్ ను ప్రారంభించారు. కానీ యాదృచ్చికంగా ఆయన చివరి సినిమా కూడా మెగా ఫ్యామిలీ తోనే కావడం ఊహించని విషాదం అనే చెప్పాలి.
#Chiranjeevi garu paid his final respects to #KotaSrinivasaRao garu and emotionally recalled the many beautiful moments and a bond built over a lifetime of shared cinema.@KChiruTweets pic.twitter.com/CtfbCjamvg
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 13, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి, గబ్బర్ సింగ్, బద్రి, అత్తారింటికి దారేది తదితర చిత్రాల్లో కోటా పలు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఆయన నటించిన చివరి చిత్రం కూడా పవన్ తోనే అని తెలుస్తోంది. 2023లో విడుదలైన 'సువర్ణ సుందరి' సినిమాకే ఆయన చివరి సినిమా అని భావించినా, 'హరిహర వీరమల్లు' చిత్రంలో ఆయన నటించిన చిన్న పాత్ర మరొకసారి ప్రేక్షకుల ముందు తీసుకురాబోతుంది. ఈ మూవీ జూలై 24న విడుదల కానుంది.
-
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. అట్టహాసంగా గద్దర్ అవార్డ్స్ -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!












Click it and Unblock the Notifications