ఆ సినిమాను 14 ఏళ్ల పాటు ఘాట్ చేశారా.. బడ్జెట్ ఎన్ని కోట్లంటే ?
కాలానుగుణంగా చిత్రపరిశ్రమ ఎన్నో మార్పులు చవిచూస్తూ, సాంకేతికత, బడ్జెట్, కథానికల పరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేడు ఇండియన్ సినిమాలు అంతర్జాతీయంగా కూడా విశేష గుర్తింపు పొందుతున్నాయి. విదేశాల్లోనూ మన చిత్రాలు భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి. అయినప్పటికీ, గతంలో తీసిన కొన్ని సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసేలా నిలిచిపోయాయి. ఇప్పట్లో 5,6 సంవత్సరాల సమయంలో ఒక సినిమాను తెరకెక్కించడం చాలా పెద్ద విషయంగా మారింది. కానీ అప్పట్లో ఒక సినిమా షూటింగ్ పూర్తి కావడానికి 14 ఏళ్లు పట్టింది అంటే నమ్ముతారా..
ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఆ సినిమా పేరు 'మొఘల్-ఏ-ఆజం'. కె. అసీఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా యాక్టర్ దిలీప్ కుమార్ హీరోగా, మధుబాల హీరోయిన్ గా నటించారు. నేటి తరానికి ఇది ఒక కల్ట్ క్లాసికల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా షూటింగ్ 1944లో ప్రారంభమై చివరికి 1960లో విడుదలై, భారతీయ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే స్థాయికి చేరుకుంది. ఆ కాలంలోనే సినిమా బడ్జెట్ రూ.1.5 కోట్లు కాగా, ఇది నేటి విలువల్లో దాదాపు రూ.300 కోట్లకు సమానం. అలాంటి బడ్జెట్‌తో, అంచనాలు మించి రూపొందిన సినిమా ఇది.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేసిన నౌషాద్ సంగీత ప్రియుల మనసుల్లో ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా 'ప్యార్ కియా తో డర్నా క్యా' పాట కోసం అప్పట్లోనే రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే దాదాపు రూ.50-100 కోట్లకు సమానం. ఈ పాట షూటింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన షీష్ మహల్ సెట్స్ అందరినీ అబ్బురపరిచాయి. అద్దాల కాంతుల్లో మెరిసిపోయే ఆ సెట్, లతా మంగేష్కర్ స్వరం ప్రేక్షకులను కట్టిపడేశాయి. 'మోహే పంగత్ పే', 'తేరీ మెహఫిల్ మే' వంటి మిగతా పాటలు కూడా సంగీతం పరంగా ఈ సినిమాను తారాస్థాయికి తీసుకెళ్లాయి.
1960 ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం ఊహించని స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టికెట్ల కోసం రెండు రోజులు ముందే క్యూలు, రాత్రంతా థియేటర్ల వద్ద బస చేసేందుకు సైతం వెనుకాడలేదంటే అతిశయోక్తి కాదు. కొన్ని థియేటర్ల వద్ద ఐదు కిలోమీటర్ల పొడవైన క్యూలు ఉన్నాయని కూడా చెబుతుంటారు. ఈ చిత్రం 150 థియేటర్లలో విడుదలై, రూ.11 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. దాదాపు 15 ఏళ్ల పాటు బాలీవుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంతేకాదు, రష్యా, చైనా వంటి దేశాల్లోనూ విడుదలై మంచి విజయం సాధించింది.
-
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
కొడుక్కి న్యాయం చేసిన షారూఖ్.. కుతుర్ని గట్టెక్కిస్తారా ?? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications