బుల్లితెర బ్యూటీ 'దీపిక' ఒక్క ఎపిసోడ్ కి అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా..?

ప్రస్తుతం స్టార్ మాలో అత్యధిక టీఆర్పీతో ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్స్ లలో 'బ్రహ్మముడి' ఒకటి. వినూత్నమైన కథనశైలి, లోతైన భావోద్వేగాలు, ఆకట్టుకునే పాత్రల సమాహారంగా ఈ సీరియల్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక ఈ సీరియల్‌తో కావ్య పాత్రలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నటి 'దీపిక రంగరాజు'. తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంది. రీసెంట్ గా హీరో నానితో కలిసి ఓ కమర్షియల్ యాడ్‌లో కూడా కనిపించింది అంటే ఈ అమ్మడి క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.

మరోవైపు సీరియల్ షూటింగ్స్‌తో పాటు, స్టార్ మాలో ప్రసారమవుతున్న పలు స్పెషల్ ప్రోగ్రామ్స్.. రియాలిటీ షోలలో రెగ్యులర్‌గా కనిపిస్తూ తన ఫ్యాన్‌బేస్‌ను మరింత పెంచుకుంటోంది దీపిక. అప్పుడప్పుడు అందాలను సైతం ఆరబోస్తూ తనదైన కామెడితో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతోంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ గురించి సినీ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది.

interesting-details-about-serial-actress-deepika-rangaraju-remunaration

భారీస్థాయిలో రెమ్యూనరేషన్..

ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు.. దీపిక రంగరాజు ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్‌కి సుమారుగా రూ.25,000 వరకు పారితోషికం అందుకుంటోందని అంటున్నారు. అంటే నెలకు రూ.7 నుంచి రూ.10 లక్షల వరకూ ఆమె ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ టీవీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటీమణుల్లో ఒకరిగా పేరు ఉందని చెబుతున్నారు.

తమిళనాడులోని పన్రూతి అనే చిన్న గ్రామంలో జన్మించిన దీపిక రంగరాజు.. మమందూర్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువు పూర్తిచేసింది. చదువులోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండే దీపిక.. నటనపై ఆసక్తితో ఉండేది. మొదట న్యూస్ ప్రెజెంటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత తమిళ టీవీలో 'చిత్రిరమ్ పెసుతాడి' అనే సీరియల్ ద్వారా నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'బ్రహ్మముడి' ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

అంతే కాకుండా తమిళంలో 'ఆరాడీ' అనే చిత్రంతో వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో త్వరలోనే బిగ్ స్క్రీన్ పై కూడా ఈ నటిని చూడొచ్చు అని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+