నెక్స్ట్ మూవీ కోసం గట్టిగానే ప్లాన్ చేసిన వెంకీ మామ.. డైరెక్టర్ ఎవరంటే ?
చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే 'విక్టరీ వెంకటేష్' సినిమాలను ఇష్టపడతారు. ఫ్యామిలీ, లవ్, కామెడీ అంటూ ఇంటిల్లిపాదిని అలరిస్తారు వెంకీ మామ . రీసెంట్ గానే సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రిలీజ్ అయ్యి భారీ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మాణం అయిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. దీంతో మళ్లీ సంక్రాంతికి సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అనే పేరుతో సినిమా చేస్తామని కూడా ప్రకటించారు.
అయితే రీజనల్ ఫిల్మ్ గానే వచ్చి ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు వెంకీ. దీంతో నెక్స్ట్ సినిమాపై ఆయన మరింత ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. దీంతోనే 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి ముందు ఒప్పుకున్న పలు సినిమాలను సైతం రద్దు చేసుకొని.. దాదాపుగా 20కి పైగా కథలను విన్నారట. ఈ క్రమంలోనే రీసెంట్ గా ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వెంకటేశ్ భేటీ అయ్యారని చర్చ జరుగుతోంది.

గతంలో వెంకటేష్ హీరో గా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించాడు. ఆ చిత్రాలు ఎంతలా ప్రేక్షకులను అలరించాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో వీరి కాంబినేషన్ లో మళ్లీ ఎప్పుడూ మూవీ ఉంటుందా అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ చేశారు. దాదాపు 7 ఏళ్ళు దాటింది కానీ మళ్లీ అనౌన్స్ మెంట్ ఏం లేదు. ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉండడంతో ఇంతవరకు మళ్లీ సినిమాకు కమణిత అవ్వలేదని అంటున్నారు.
అయితే ఇప్పుడు మాత్రం ఓ సినిమాని సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉండగా.. స్క్రిప్ట్ చాలా వరకు పూర్తి కాకపోవడంతో ముందుగా అట్లీ సినిమాని మొదలు పెట్టబోతున్నాడు బన్నీ. ఆ చిత్రం పూర్తి అయ్యే లోపు.. వెంకటేష్ తో సినిమా పూర్తి చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇప్పటికే వీళ్లిద్దరు రెండు మూడు సార్లు స్టోరీ సిట్టింగ్స్ కూడా వేశారని.. నువ్వు నాకు నచ్చావ్' లాంటి సబ్జెక్టు ని సిద్ధం చేశారని టాక్ నడుస్తోంది.
ఇక త్వరలోనే వీరి కాంబోలో సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతే కాకుండా ఆ సినిమాలో ఒక యంగ్ హీరో కూడా ముఖ్యపాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. రానా నాయుడు వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో తన టాలెంట్ ఏంటో మరోసారి గుర్తుచేసిన వెంకీ ఈ సినిమాతో పాన్ ఇండియా లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది.












Click it and Unblock the Notifications