ఆ స్టార్ కమెడియన్‌కి చనిపోతారని ముందే తెలుసా.. అంతకు ముందే రెండు సార్లు !!

తెలుగు సినిమా హాస్య రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి "ధర్మవరపు సుబ్రహ్మణ్యం". తనదైన శైలి, టైమింగ్‌, మిమిక్రీ టచ్‌తో ఆయన చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. కాగా 2013 డిసెంబర్ 7న లివర్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ ఆయన మరణించారు. అయితే ఆయన చివరి దశలో ఉన్నప్పుడు తాను చనిపోతానని ముందే తెలిసి షాకింగ్ నిర్ణయం తీసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా అంతకు ముందు కూడా రెండుసార్లు ఆయన మరణపు అంచుల వరకు వెళ్లి వచ్చిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

సినీ ప్రయాణం..

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెం గ్రామంలో జన్మించిన ధర్మవరపు.. చిన్ననాటి నుంచే నాటకాలపై ఆసక్తి చూపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలితో ఆయనకున్న అనుబంధం ఎంతో బలమైనది. థియేటర్ అనుభవమే ఆయనకు సినిమాల్లోకి వచ్చేలా చేసిందని చెబుతుంటారు. సినిమాల్లోకి రాకముందే 150 నుంచి 200 వరకు వాణిజ్య ప్రకటనలు, వ్యవసాయ కార్యక్రమాలకు వాయిస్‌ ఇచ్చారు. అలానే ప్రముఖ టీవీ ఛానల్ లో డింగ్‌డాంగ్ అనే రాజకీయ వ్యంగ్య కార్యక్రమం ద్వారా తన వ్యంగ్య హాస్యాన్ని చూపారు.

interesting-detais-about-comedian-dharmavarapu-subramaniam

కాగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన జయంబు నిశ్చయమ్మురా చిత్రంలో రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రతో సినిమాల్లోని ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నువ్వు నేను, ధైర్యం వంటి చిత్రాల ద్వారా లెక్చరర్ పాత్రల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే ఒక్కడులో పాస్‌పోర్ట్ ఆఫీసర్.. వర్షంలో వాతావరణ వార్తలు చెప్పే గాలి గన్నారావు.. రెడీలో హ్యాపీ రెడ్డి పాత్రలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆలస్యం అమృతం సినిమాతో ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.

సుబ్రహ్మణ్యం కేవలం నటుడుగా మాత్రమే కాకుండా దర్శకుడు, రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ తన ప్రతిభను చూపించారు. తోక లేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో మళ్లీ దర్శకత్వం వైపు చూడలేదు. మరోవైపు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ధర్మవరపు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్గా నియమితులై కళాకారుల సంక్షేమం కోసం సేవలు అందించారు.

మూడు ప్రాణాంతక పరిస్థితులు..

అయితే సుబ్రహ్మణ్యం జీవితంలో మూడు పెద్ద క్రిటికల్ సిట్యుయేషన్లను ఎదుర్కొన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వాటిలో

2001 ప్రమాదం..

నువ్వు నేను సినిమా సక్సెస్ పార్టీ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు మీద బస్సు ఎక్కింది. తలకు 21 కుట్లు, చేతికి ఆపరేషన్ చేసి రాడ్స్ వేశారు. అయితే అభిమానుల ప్రేమ, ఇండస్ట్రీ పరామర్శలతో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

అడవిలో కీటకం కాటు..

శ్వేతనాగు సినిమా షూటింగ్ సందర్భంగా బెంగళూరు దగ్గరలోని అడవిలో ఆయనను ఓ కీటకం కుట్టింది. గదిలో స్పృహ కోల్పోయి పడిపోవడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. స్మోక్ కారణంగా కూడా సమస్య ముదిరిందని వైద్యులు తెలిపారట. పది రోజులు కోమాలో ఉండి తర్వాత కోలుకున్నట్టు స్పష్టం చేశారు.

interesting-detais-about-comedian-dharmavarapu-subramaniam

లివర్ క్యాన్సర్..

2012లో ఆరోగ్యం బాగా క్షీణించడంతో వైద్యులు ఫోర్త్ స్టేజ్ లివర్ క్యాన్సర్ అని నిర్ధారించారు. కేవలం 11 నెలలే జీవించే అవకాశం ఉందని చెప్పారు. ఆ తర్వాత ఇంటికే పరిమితమై కన్నుమూశారు.అయితే తాను చనిపోయే ముందు తన పరిస్థితి అర్ధం అయ్యి.. క్లోజ్ ఫ్రెండ్ అయిన బ్రహ్మానందంని పరామర్శించడానికి రావొద్దని అన్నారంట. ఆ పరిస్థితుల్లో చూడలేరని.. అందుకే వద్దన్నారని బ్రహ్మీ కూడా ఓ సందర్భంలో వివరించారు.

మొత్తంగా 23 ఏళ్ల సినీ ప్రయాణంలో 170కి పైగా సినిమాల్లో నటించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ మరచిపోలేని హాస్యానందాన్ని పంచారు. ఆయన చేసిన పాత్రలు, ఆయన వదిలి వెళ్లిన నవ్వులు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అనడంలో సందేహం అక్కర్లేదని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+